టైప్ చెయ్యకుండా వాట్సాప్ మెసేజ్ లను ఇలా పంపండి..

ఇక ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే యాప్ సర్వీస్ లలో ఒకటి. కుటుంబం ఇంకా స్నేహితులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, పని ప్రయోజనాల కోసం కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ ప్రజలకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు, పని మధ్యలో, ఒక సందేశాన్ని టైప్ చేయలేకపోవడం జరుగుతుంది.ఇక అందువల్ల వారు కమ్యూనికేషన్‌ను కోల్పోతారు. అయితే చింతించకండి, ఎందుకంటే కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్‌ని ప్రారంభించింది, దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ లో టైప్ చేయకుండా సందేశాలను పంపవచ్చు. దీనికి మీరు చెయ్యాల్సిందల్లా మీ మెసేజ్ ని మీ నోటితో పెద్దగా పలకడమే.ఇలా మీ మెసేజ్ ని పలకడం వల్ల మీ మెసేజ్ అక్కడ టైప్ అవ్వడం జరుగుతుంది.
ఇక కావలసిన మెసేజ్ ని అలా టైప్ చేసిన తర్వాత, అక్కడ పంపేవారికి సెండ్ బటన్‌ను నొక్కాలి. వాట్సాప్‌లో ఏదైనా పెద్ద మెసేజ్ ని పంపాలనుకునే వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ఇక టైప్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ లను పంపడానికి ఈ క్రింద వున్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
 స్టెప్ 1: మీ వాట్సాప్‌ని ఓపెన్ చేసి మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న చాట్‌ని ఎంచుకోండి
స్టెప్ 2: 'కీబోర్డ్' తెరిచి, దానిపై మైక్ గుర్తును నొక్కండి.
స్టెప్ 3: మైక్ ఓపెన్ చెయ్యండి. ఇంకా దాన్ని పరీక్షించమని మిమ్మల్ని అడుగుతారు
స్టెప్ 4: మీ సందేశాన్ని రికార్డ్ చేయండి. ఇంకా ప్రక్రియ పూర్తయిన తర్వాత, మైక్ చిహ్నాన్ని మళ్లీ నొక్కండి.
స్టెప్ 5: ఈ రోజుల్లో చాలా కీబోర్డులు హిందీ ఇంకా ఆంగ్లంతో సహా అనేక భాషలతో నిర్మించబడ్డాయి - మీ భాషను ఎంచుకోండి.
స్టెప్ 6: మీరు మైక్‌లో ఏది చెప్పినా ఇప్పుడు బాక్స్‌లో టైప్ చేయబడుతుంది. మీరు సందేశాన్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత, సెండ్ బటన్ నొక్కండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: