ఆర్బీఐ : ఆటోమేటిక్ వద్దు .. ఎప్పటికప్పుడే ముద్దు ..

బ్యాంకింగ్ వ్యవస్థ లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటి నుండి ఆన్ లైన్ మోసాలు బాగా పెరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుండో హ్యాకర్లు తమ జ్ఞానాన్ని పరీక్షించుకోవానికి వివిధ వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు. ప్రత్యక్ష విధానం అమలులో ఉన్నంత వరకు నకిలీ దందా వలన సమస్యలు తలెత్తుతుండేవి. వాటికి పరిష్కారంగా తెరపైకి వచ్చిందే ఆన్ లైన్ విధానం. దీనిలో కూడా అనేక రకాల లోపాలు ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని అనేక మంది నేరాలకు పాల్పడుతున్నారు. ఆయా వ్యవస్థలు ఎన్ని జాగర్తలు తీసుకున్నప్పటికీ ఈ నేరగాళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఈ నేరాల సంఖ్య తీవ్రం అవుతున్నట్టు అధికారులు చెపుతున్నారు.
ఇది సాధారణ సమాజంలో తలెత్తే సమస్యలైతే, ఇక దేశాల మధ్య వాణిజ్య తదితర యుద్ధ తంత్రాలలో శత్రుదేశాల సమాచారాన్ని తెలుసుకోవడం లేదా దొంగిలించడం వంటి వి చేసి ఆయా దేశాలు తమ దే పైచేయి అనిపించుకొంటున్నాయి. ఈ సమస్య ప్రస్తుతం ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు ఇటీవల బయట పడ్డ సామజిక మాధ్యమాల సమాచార దోపిడీ సాక్ష్యంగా ఉంది. ఇక దేశాల మధ్య నిశబ్ద యుద్ధం జరుగుతూనే ఉంది అనడానికి ఇటీవల చైనా బ్యాంకు యాప్స్ ద్వారా వ్యక్తిగత లోన్స్ ఇస్తూ వారిని వడ్డీ కోసం వేధిస్తూ, అనేక కోట్లు కొట్టేయడం మరో సాక్ష్యం.
ఇవన్నీ ఉన్నప్పటికీ, ఎన్నో సంస్థలు ప్రభుత్వ సూచనల మేరకు ఆన్ లైన్ విధానాన్నే అమలుచేస్తున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం జారుతుతూనే ఉంది. అలాగే అడపాదడపా నేరగాళ్లు కూడా వాళ్ళ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. అందుకే దేశఅత్యున్నత బ్యాంకింగ్ వ్యవస్థ ఈ తరహా లావాదేవీలలో కూడా ఆటోమేటిక్ గా నగదు జమ అనేది నేరస్తులకు ఉపకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సంస్థలు, వినియోగదారులు దీనికి ప్రత్యామ్నాయాలను వాడుకోవాలని సూచించింది. దీని కోసం వినియోగదారులు ఆయా కార్డులు, యూపిఐ, పీపీఐ విధానాలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో నేరానికి అవకాశం ఇవ్వకపోవటమే అందరికి మంచిదని ఆర్బీఐ తెలిపింది. సాధారణంగా కొన్ని చెల్లింపులు నెల గడవగానే తరువాతి నెలకు నగదు ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. ఈ తరహా చెల్లింపులు కాకుండా ఎప్పటికప్పుడు పై న చెప్పిన విధానాలు వాడుకోవాలని ఆర్బీఐ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: