బుల్లి పిట్ట: నేడు ప్రపంచంలోనే చౌకైన మొబైల్ ను విడుదల చేసిన రిలయన్స్ ..

Divya
టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ ఇప్పుడు మరొక సంచలనానికి తెర తీస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో, చౌకైన మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఒక చౌకైన స్మార్ట్ మొబైల్ ను మనకు నేడు వినాయక చవితి సందర్భంగా అందిస్తున్నట్లు ముకేశ్ అంబానీ తెలియజేశాడు.ఆ వివరాలను చూద్దాం.
ఇక కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం ఈ మొబైల్ యొక్క ఫ్యూచర్స్ ఇలా ఉంటాయి..
1). మొబైల్..5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే..QM 215 సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఒక పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే..720X1600 . ఈ మొబైల్ పూర్తి స్క్రీన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది.
2). ఇక ఈ మొబైల్..1.4GHZ క్యాడ్ కోర్ ప్రాసెస్ ను కలిగి ఉంది. ఇక ఇందులో 2GB ram  కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ కు మరొక రామ్ ఆప్షన్ ఉండదు. ఇక దీంట్లో మెమొరీ కార్డు విషయానికొస్తే, 16 జీబీ మెమొరీ కార్డు సపోర్టుతో మనకు లభిస్తుంది. దానిని 128 GB మెమొరి కార్డు వరకు మనం పెంచుకోవచ్చు.
3). ఒక మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే.. ఫ్రంట్ కెమెరా ,బ్యాక్ కెమెరా రెండు అందుబాటులో ఉంటాయట. ఫైవ్ మెగాపిక్సల్ రియర్ కెమెరాను పొందుపరిచారు. ఫోటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని కూడా అందుబాటులో ఉంచింది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే టూ మెగాపిక్సల్ వరకు అందుబాటులో ఉంటుంది.
4). ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే..2500 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు. ఈ బ్యాటరీ ఎన్ని గంటల సమయం వస్తుంది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు.. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ తో పనిచేస్తుంది.
5). ఇక ఈ మొబైల్ లో  డబుల్ సిమ్ స్లాట్ అందుబాటులో ఉండనుంది. ఇక ఇందులో 4G, సిమ్  కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో వైఫై, మొబైల్ హాట్ స్పాట్, బ్లూటూత్ వంటి ఆప్షన్ కూడా అందించనుంది. ఇక ఈ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: