రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన..!

MOHAN BABU
గతంలో నుంచే  అల్పపీడనం ప్రభావం ఆగస్ట్ 31వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల మీద పూర్తిగా తగ్గిపోయింది.
 కాకుంటే గాలిలో తేమశాతం ఎక్కువగా  ఉండటం వల్ల నిన్న  తెలంగాణ మరియు కోస్తాంధ్ర జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. మరియు  అక్కడక్కడ మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి.  
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం  నుండి దక్షిణ కోస్తాంధ్ర పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించింది. దీంతో రెండు  తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 2వ తేదీ నుంచి  రాత్రి వరకు చతిస్గడ్  నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ఉదయం నుండే రాయలసీమ ముఖ్యంగా కడప, చిత్తూరు) మరియు దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
క్రమంగా ఈ యొక్క వర్షాలు 2 ,3, 4 తేదీలలో మిగిలిన రాయలసీమ, కోస్తాంధ్ర, అలాగే తెలంగాణ జిల్లాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  మొత్తం మీద ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు 2, 3, 4 తేదీలలో రాయలసీమ, కోస్తాంధ్ర (అమరావతి, విజయవాడ సహా), తెలంగాణ (హైదరాబాద్ సహా) జిల్లాలలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు 5, 6, 7 తేదీలలో వర్షసూచన సెప్టెంబర్ 5వ తేదీన సాయంత్రం రాత్రి కల్లా ఒరిస్సా మరియు ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని వాయువ్య మరియు పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన* ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.  ఈ అల్పపీడనం ప్రభావంతో  5, 6,7 తేదీలలో కోస్తాంధ్రలోనీ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో చాలాచోట్ల మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
👉5, 6, 7 తేదీలలో తెలంగాణ అన్ని జిల్లాలలో  చాలాచోట్ల మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
👉ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
            *భారీ నుండి అతిభారీ వర్షసూచన*
👉 5,6,7 తేదీలలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది
5, 6,7 తేదీలలో తూర్పు, ఈశాన్య, ఉత్తర, పశ్చిమ (హైదరాబాద్ సహా) తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
                 ఔట్ లుక్
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల 2,3,4,5,6,7 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 11వ తేదీ కల్లా ఒరిస్సా మరియు కోస్తాంధ్ర వాయువ్య-పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: