ఐ ఓ ఎస్.. గూగుల్ మ్యాప్ లో సరికొత్త ఆవిష్కరణ.

Divya
ఐఓఎస్ యాపిల్ ఫోన్ లో ios 13 లో భాగంగానే గత రెండు సంవత్సరాల క్రితమే ఆపిల్ డార్క్ మోడ్ ను  విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా గూగుల్ మ్యాప్స్ కూడా డార్క్ మోడ్ ను విడుదల చేసింది.. ఈ గూగుల్ మ్యాప్స్ లో డార్క్ మోడ్ ను ఎక్కువగా రాత్రులు లేదా చీకటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో ఉన్న డార్క్ మోడ్ ను  ఉపయోగించడం వల్ల కంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా , కంటి రెటీనా సంరక్షణ కోసమే గూగుల్ ఈ సరికొత్త ఆవిష్కరణలు తీసుకు వచ్చినట్లు సమాచారం.

ఇకపోతే ఆపిల్ ఐఓఎస్ లో గూగుల్ మ్యాప్స్ లో  ఈ డార్క్ మోడ్ ను  ఎలా సెట్ చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీ మొబైల్ గూగుల్ మ్యాప్స్ లో డార్క్ మోడ్ ఆన్ చేయడానికి , సెట్టింగ్ లో మెనూ ఆప్షన్ కి  వెళ్ళాలి. అక్కడ ఉన్న డార్క్ మోడ్ పై నొక్కి, ఆ తర్వాత క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ ఇష్టం.. సెట్టింగ్ లకు సరిపోయే విధంగా గూగుల్ మ్యాప్స్ లో మీ అవసరానికి బట్టి,  బ్రైట్  మోడ్ లేదా డార్క్ మోడ్ ను ఎంచుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది. మీరు మీకు కావలసిన మోడ్ ను ఎంచుకోవచ్చు.


ఇక ఈ ఆగస్టు నెల నుంచి ఐఓఎస్ లో గూగుల్ మ్యాప్స్ కూడా సరికొత్త ఫీచర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అదేమిటంటే ఒకటి మీకు దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితులను చూపించడంతో పాటు, మీరు నిర్దిష్ట ప్రదేశానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు,  షార్ట్ కట్ లను కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మీ ఇంటికి సమీపంలో ఉన్న రెస్టారెంట్ లు  లేదా ఇతర ప్రదేశాలను కూడా చూపించడానికి ఈ గూగుల్ మ్యాప్ సహాయపడుతుంది.

అంతే కాదు మీరు వెళ్లాల్సిన ప్రదేశాలను కూడా , ఈ గూగుల్ మ్యాప్స్ లో సేవ్ చేసుకొని అవకాశం  కూడా కల్పించడం జరిగింది. అంతేకాదు ఐఓఎస్ త్వరలోనే గూగుల్ లైవ్ లొకేషన్ కి కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు గ్రూప్ చాట్ లో ఉన్న మీ స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు కూడా మీరు ఎక్కడ ఉన్నారో.. తెలియజేయడానికి ఇదొక సులభమైన మార్గము. ప్రస్తుతం మీరు కావాలంటే ఒక గంట మాత్రమే షేర్ చేసుకోవచ్చు. లేదా అత్యవసరము అంటే దానిని మరో మూడు రోజుల వరకు షేర్ చేసుకునే అవకాశం కల్పించబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: