ఈ హెడ్‌సెట్‌ వాడడం వల్ల ఎన్ని ప్రయోజనలు అంటే...?

Suma Kallamadi
తాజాగా శాస్త్రవేత్తలు నొప్పిని తగ్గించే హెడ్‌ సెట్‌ లను అభివృద్ధి చేశారు. వీటిని మొత్తం 8 వారాల పాటు ధరించిన తరువాత.., నిద్ర, మానసిక స్థితి అలాగే జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మనలో ఏర్పడే ఆందోళన, నిరాశలను కూడా ఈ హెడ్‌ సెట్‌ తో బాగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నిజజీవితంలో మామూలుగా ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్ లను ఉపయోగించి నొప్పిని తగ్గించుకుంటాను. కాకపోతే ఇది ప్రతి రోగికి ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పలేము. వీటి వల్ల కొన్ని కొన్ని సార్లు దుష్ప్రభావాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. అలాగే.. కొన్ని సందర్భాల్లో పెయిన్ కిల్లర్లను వాడటం కొంతమందికి అలవాటుగా మారిపోతుంది.
ఇక శాస్త్రవేత్తలు కనిపెట్టిన పరికరాన్ని తలలో ధరించిన తరువాత, నొప్పి తగ్గుతుందని వారు వెల్లడించారు. మామూలు హెడ్‌ సెట్ నొప్పికలిగించే మెదడు తరంగాలను చదువుతుందని.. కాకపోతే ఈ పరికరం నొప్పిని ఎదుర్కోవటానికి మెదడును సిద్ధం చేస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇకపోతే ఈ పరికరం ఎలక్ట్రో - ఎన్సెఫలోగ్రామ్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. హెడ్‌ సెట్‌ పరికరంలోని 8 ఎలక్ట్రోడ్లు తల మీద ఉంచుతారు. వీటివలన మెదడు లోని విద్యుత్ కార్యకలాపాలను మానిటర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రో - ఎన్సెఫలోగ్రామ్ టెక్నాలజీ యంత్రంతో మూర్ఛ లాంటి వ్యాధులు కూడా కనుక్కోవచ్చు. ఈ పరికరాన్ని నార్తాంప్టన్‌ షైర్‌ లోని ఈస్ట్ మిడ్‌ ల్యాండ్ వెన్నెముక క్లినిక్‌ లో వెన్నెముక సర్జన్ అయిన నిక్ విర్చ్ చర్మం, కీళ్ళు, అవయవాలలో ఉన్న ప్రత్యేక గ్రాహకాలను మెదడుకు నరాల ద్వారా నొప్పి సంకేతాలను పంపినప్పుడు మనకు నొప్పి తెలుస్తుందని తెలిపారు.ఇక పోతే ఈ పరికరాన్ని మార్కెట్లోకి వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకు రా పోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామానికి సంబంధించి ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై జరిగిన పరిశోధనలో భాగంగా 90 శాతం మంది రోగులు ఈ పరికరం సహాయంతో జీవన నాణ్యత, నిద్ర లాంటి తదితర అంశాలలో ఇబ్బందుల నుంచి బయట పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: