మనదేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు, ఎలక్ట్రిక్ స్కూటర్ లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అయితే ఇంతకుముందు కేవలం రెండు కలర్ లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఓలా తాను రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ను దాదాపు 10 రంగులతో మనముందుకు తీసుకువచ్చింది. అది కూడా ఈనెలాఖరులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఓలా అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది..
ఇందులో ముఖ్యంగా మీకు నచ్చిన రంగును ఎంచుకునేందుకు వీలు కూడా కల్పించింది. ఇక ఇందులో పర్పుల్, బ్లూ ,రెడ్ , వైట్ , బ్లాక్, డార్క్ బ్లూ, ఎల్లో తో సహా మొత్తం పది రంగుల తో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేసామంటే, 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఓలా అధికారికంగా ప్రకటించిన వెంటనే కేవలం 24 గంటల లోపే దాదాపు లక్ష బుకింగ్ లు అందుకున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది.
విస్తృత శ్రేణి రంగులను ఎంపిక చేసుకోవడంలో, అన్ని వయసుల వారి దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కొత్త బ్యాటరీతో నడిచే స్కూటర్ లో కొన్ని సెగ్మెంట్ తో ప్రముఖ లక్షణాలతో, సరి కొత్త టెక్నాలజీ తో మన ముందుకు వచ్చింది. ఇందులో ఏవైనా సామాన్లను తీసుకెళ్లడానికి హుక్, స్ప్లిట్ టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్ , సింగిల్ పీస్ సీట్, ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పోర్ట్ తో సహా అనేక ఫీచర్లను మనకు అందించడం జరిగింది.
ఇక ఈ స్కూటర్ ను పూర్తిగా మనం పూర్తీగా ఛార్జ్ చేసినట్లయితే, దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక 50 శాతం ఛార్జ్ చేసినప్పుడు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఆ సంస్థ తెలిపింది. ఏది ఏమైనా భారత మార్కెట్లో విడుదల చేసిన అత్యధిక శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ లలో, ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటిగా నిలవ బోతోంది.