మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా అయితే ఇది మీ కోసం..!
సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలనో కూర్చోని ఎక్కడి డైటాను అయినా తస్కరిస్తున్నారు. ఇందుకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వేదిక చేసుకుంటున్నారు. సైబర్ నేరస్థుల బారిన పడకుండా ఉండేందుకు గాను గూగుల్ క్రోమ్‌ను యూజర్స్ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే సైబర్ దొంగలు సెక్యూరిటీ లోపం ద్వారా డివైజ్ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని, డబ్బులు కాజేస్తారు. గూగుల్ ఈ విషయంలో ఎలాంటి భద్రత కల్పించడం గమనార్హం. కాగా, గూగుల్ యూజర్స్ అలర్ట్‌గా ఉండాలి.
ఇప్పటికే కొంతమంది సైబర్ నేరస్థులు చాలా మంది వినియోగదారుల గోప్యమైన సమాచారాన్ని తస్కరించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి గూగుల్ క్రోమ్ పాత వర్షన్ వాడే వారందరూ వెంటనే అప్రమత్తం కావాలి. బ్రౌజర్ వర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఇందుకు గాను గూగుల్ క్రోమ్ సెట్టింగ్‌లో హెల్ప్, ఏబౌట్ గూగుల్ క్రోమ్ క్లిక్ చేసి మీ క్రోమ్ వెర్షన్ తెలుసుకోవాలి. లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో 91.0.4472.164 ఐపీ అడ్రస్ టైప్ చేసి ఏ వర్షన్ వాడుతున్నారో తెలుసుకోవచ్చు. ఓల్డ్ వర్షన్‌లోనే వర్క్ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే అప్ డేట్ చేసుకొని మీ డేటా ను జాగ్రతగా కాపాడుకోండి.