అంతరిక్ష యాత్ర సామాన్యులకు కూడా అందుబాటులోకి రానుందా..?

MOHAN BABU
అంతరిక్ష యాత్ర అంటేనే చాలామంది భయపడతారు. అంతరిక్ష యానానికి వెళ్లి వచ్చిన వారిని ఎంతో గౌరవంగా చూస్తారు. అలాంటి అంతరిక్ష యానానికి వెళ్లాలంటే కూడా ధైర్యం కావాలి. ఇప్పుడు  ప్రస్తుత కాలానికి టెక్నాలజీ పెరగడంతో  అంతరిక్షయానం కూడా సామాన్యులకు అందుబాటులోకి రానుంది. కమర్షియల్ గా తొలి అంతరిక్ష యానం విజయవంతం అవ్వడంతో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి, బ్రిటిషర్ల బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సస్  మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. స్పేస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులో భారీ పెట్టుబడులకు ఆయన మొదలు పెట్టారు. దీంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ కేంద్ర బిందువు అయ్యాడు. లండన్ కు చెందిన  సెరపిన్ స్పేస్ టెక్ సంస్థలో విలువైన వాటా కొనుగోలు చేసినట్టు సెరాపిన్ ప్రకటించినది.


 ఇండియన్ కు చెందిన అమెరికన్ ఆస్ట్రోనర్ బండ్ల  శిరీష మొదటి స్పేస్ యాత్రలో  చాన్సు దక్కించుకుని ఆదివారం  వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ విమానంలో అంతరిక్షానికి వెళ్ళి వచ్చిన విషయం అందరికీ తెలుసు. స్పేస్  ప్లేన్లో  అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికి  టికెట్ ధరను కూడా 1.85 కోట్ల రూపాయలుగా  నిర్ణయించిన ఆమె  ఆ డబ్బును కూడా చెల్లించి విజయవంతంగా యాత్ర పూర్తి చేసి వచ్చినది. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లిన వారు  వారు పొందిన అనుభూతిని తెలియజేస్తూ ఇంకా నేను అక్కడే ఉన్నట్లు ఉందని  అంటున్నారు. అద్భుతం అనే మాట కన్నా ఇంకా ఏదైనా పెద్ద పదాలు ఉంటే అనుభూతి ఆ పదానికి సరిపోతుందని  వాళ్ల ఎక్స్పీరియన్స్ తెలియజేశారు. చిన్నప్పటి నుంచే అంతరిక్ష యాత్ర కు వెళ్లాలని కలలు కన్నా ఆ కలలు నిజం నిజమయ్యాయని తమ ఇంటర్వ్యూలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచాయని అన్నాడు.


ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ సంపన్నుడు బ్రాన్సస్ ఈ అంతరిక్ష యాత్ర  సక్సెస్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే  ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంత మేరకు పెట్టుబడులు పెట్టింది సెరఫీమ్ వెల్లడించిన ప్పటికీ  178 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టి  వాణిజ్య కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో అంతరిక్ష యాత్రను  సామాన్యులకు చేరువ చేసే రీతిలో ఈ ప్రయోగాలు చేయనున్నట్లు రిచర్డ్ బ్రాన్సస్ రంగంలో పెట్టుబడులు పెట్టానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: