బుల్లిపిట్ట: ఈ టీవీ ల పై ఏకంగా రూ.24 వేల తగ్గింపు..

Divya

ఈ - కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్.. తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో భాగంగానే ఫ్లిప్కార్ట్ "ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట" స్మార్ట్ టీవీ లపై సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ తో పాటు క్రెడిట్ కార్డ్ అలాగే యాక్సిస్ డెబిట్ కార్డ్ తో  కొనుగోలు చేసే వారికి 10% రాయితీ కూడా లభించనుంది. ఇక ఈ సేల్ లో భాగంగానే టీవీ కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లను ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ఏ టీవీ పై ఎంత వరకు ఆఫర్ వర్తిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. రియల్ మీ 32 అంగుళాలు:
రియల్ మీ  32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడి టీవీ పై సుమారు రెండు వేల రూపాయలను డిస్కౌంట్ కింద ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకటించక ముందు ఈ టీవీ ధర 17,999 రూపాయలు ఉండగా, ఇక ఆఫర్ ప్రకటించిన తర్వాత దీని ధర 15,999 రూపాయలకే పొందవచ్చు.

2. సాంసంగ్ హెచ్డీ రెడీ 32 అంగుళాలు:
సాంసంగ్ అందిస్తోన్న హెచ్డీ రెడీ 32 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ ధర మార్కెట్లో 19,990 రూపాయలు ఉంది. కానీ ఫ్లిప్కార్ట్ నుంచి మనకు 2,500 రూపాయల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది.కాబట్టి దీనిని 17,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

3. ఎల్ జీ  43 అంగుళాల  టీవీ:
ఎల్ జీ అందిస్తున్న  కొత్త  43 అంగుళాల ఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రస్తుతం 40,990 రూపాయలు మార్కెట్ ధర ఉండగా, దీనిపై 9000 రూపాయలు తగ్గించి, రూ.31,990 కి ఫ్లిప్కార్ట్ మనకు అందిస్తోంది.

4. వి యు 50 అంగుళాల టీవీ:
Vu అందిస్తోన్న సరికొత్త ప్రీమియం వెర్షన్ అయినా 50 inch టీవీ మార్కెట్ ధర ప్రకారం 60,000 రూపాయలు పలుకుతోంది. ఇక దీనిపై సుమారు 24 వేల రూపాయలు తగ్గించి, 36,999 రూపాయలు ఇవ్వడం గమనార్హం.

5. వన్ ప్లస్ యు సిరీస్:
ఇక వన్ ప్లస్ టీవీ లు ఆల్రెడీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక దీని ధర రూ.49,999 ఉండగా ,ఈటీవీ పై మరో మూడు వేల తగ్గుదలతో రూ.46,999 కి లభిస్తోంది.


6. మోటో రోలా 55 అంగుళాల టీవీ:
మోటోరోలా కంపెనీ నుంచి విడుదలైన రెవో పేరుతో 55 అంగుళాలు కలిగిన 4k ఎల్ఈడి టీవీ ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల అయింది. దీని ధర 49,999 రూపాయలు కాగా దీనిపై ఐదు వేల రూపాయల భారీ తగ్గింపుతో  44,999 రూపాయలకి మనకు అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: