ఇకనుంచి రైతు ఫర్టిలైజర్ కొనాలంటే ఆధార్ కార్డు లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని రైతాంగానికి ఎలాంటి సమస్యలు వచ్చినా, అవకతవకలు లేకుండా ఎరువులను సరఫరా చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిని ముందుకు తీసుకొచ్చింది. పద్ధతితో ఎరువుల తయారీ కంపెనీ నుంచి రైతు కొనుగోలు వరకు పంపిణీ ప్రక్రియ పూర్తిగా డైరెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ పద్ధతిన జరుగుతుంది. కరోణ విజృంభిస్తున్న తరుణంలో రైతులకు ఇబ్బంది కలగకూడదని గతంలో కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ డీలర్లు ఇప్పటినుంచి ఈ పద్ధతిని పాటించాలని కేంద్ర ప్రభుత్వ సూచనలు జారీ చేసింది.
**ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పద్ధతి**
దీనికొరకు ప్రతి డీలర్ దుకాణంలో "పాయింట్ ఆఫ్ సేల్" పరికరాలను అందుబాటులో ఉంచారు. రైతు ఆధార్ కార్డు తీసుకు వచ్చి పిఓఎస్ పరికరంలో వేలి ముద్ర వేసి ఆన్ లైన్ ఎంటర్ చేసిన తర్వాత ఎరువులు ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా ఇష్టరాజ్యాంగ అమ్ముకునే ఎరువులను అడ్డుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు రెండు లక్షల 26వేల పీఓఎస్ పరికరాలను అందుబాటులో ఉంచామని తెలిపింది. అంతేకాకుండా కొంతమంది రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి వాటిని స్టాక్ చేసుకొని మిగతా రైతులకు ఇబ్బంది చేస్తున్నారని అలా ఎక్కువ కొనుగోలు చేసిన టాప్ 20 మంది రైతులను మరియు తరచూ ఎరువులనుకొనే రైతుల జాబితాను తీసి మరలా వ్యవసాయ అధికారితో తనిఖీ చేసి ధృవీకరించడం జరుగు తుందన్నారు. రైతులు ఎరువులు కొన్న తర్వాత తన సెల్ ఫోన్ కి బిల్ నెంబర్, అలాగే డీలర్ పేరు, ఎంతకు కొన్నారు, డబ్బులు ఎంత చెల్లించారు, ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇచ్చిందో మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని తెలిపారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్, రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖలో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు , మార్కెటింగ్ ఫెడరేషన్, ఫర్టిలైజర్ కంపెనీ డిబిటిలో ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డును కలిగి ఉంటాయి. ఇందులో ఆయా శాఖల కంపెనీలు వారి వద్ద ఉన్న స్టాక్ వివరాలను అమ్మకాలకు సరఫరాకు అప్డేట్ చేస్తూ ఉంటాయి. దీని ద్వారా ఫర్టిలైజర్ కంపెనీల దగ్గర, ఓడరేవుల వద్దా జిల్లాలో డీలర్ల వద్ద స్టాక్ ఎంత ఉంది, ఇంకెంత కావాలనే దానిపై భారత ప్రభుత్వ ఫర్టిలైజర్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా వచ్చే పంట కాలానికి అవసరమైన ఎరువులను ముందే సూచించి, ఇంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో దాన్ని బట్టి తయారు చేయవలసి ఉంటుంది. దీని ద్వారా రైతులకు ఎరువుల కొరత రాకుండా సక్రమంగా జరుగుతుంది.