సైనికులు అనేవారు లేకపోతే దేశానికి ఎలాంటి రక్షణ ఉండదు.ఉగ్రవాదులు దేశం మీద దాడి చెయ్యకుండా ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలాగా దేశాన్ని కాపాడుతూ వుంటారు. జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా కాపాడుకుంటామో దేశాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి.ఇక డిఫెన్స్ అనేది చాలా మంచి ఫీల్డ్. దేశాన్ని రక్షించే సైనికుడిగా దీని విలువ చాలా గొప్పది.కాబట్టి యువత ఖచ్చితంగా డిఫెన్స్ వైపు మొగ్గు చూపాలి. దేశాన్ని రక్షించే సైనికుడిలా మారాలి. దేశాన్ని కాపాడుకోవాలి.ఇక డిఫెన్స్ చెయ్యాలనుకునేవారికి తాజాగా గుడ్ న్యూస్ అందింది.డిఫెన్స్ టెక్నాలజీలో కొత్తగా రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను డీఆర్డీఓ, ఏఐసీటీఈ సంయుక్తంగా ప్రారంభించడం జరిగాయి.ఇక డీఆర్డీఓ చైర్మన్ అయిన డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్ అయిన ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి గురువారం వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది.
ఇక రక్షణ సాంకేతిక రంగంలో అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ కొత్త కోర్సు పునాది వేస్తుందని నిపుణులు సూచించడం జరిగింది. ఇక ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు అలాగే విశ్వవిద్యాలయాలు ఇంకా ఐఐటీలు మరియు ఎన్ఐటీలు ఇంకా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు నిర్వహణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్స్ టెక్నాలజిస్ట్స్(ఐడీఎస్‌టీ) పూర్తి సహకారం అందించబోతుంది.ఇక ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఈ విద్యను మనం అభ్యసించవచ్చు. ఇక అలాగే ఇందులో కాంబాట్ టెక్నాలజీ ఇంకా ఏరో టెక్నాలజీ అలాగే నావల్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్ ఇంకా డైరెక్టెడ్ ఎనర్జీ టెక్నాలజీ అలాగే హై ఎనర్జీ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలు ఉంటాయి.ఇక ఈ ఎంటెక్ డిఫెన్స్ ప్రోగ్రాంలో ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీలను సైనికులు ఎలా వాడుకోవాలో నేర్పిస్తారు.పైగా ఈ సర్టిఫికెట్ కూడా చాలా విలువైనది. కాబట్టి ఆసక్తి వున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.