బుల్లిపిట్ట: ఆధార్ నెంబర్ గుర్తు లేని వాళ్ళు ఇలా చేయండి..
ఒకవేళ మీరు ఏదైనా పని మీద ఆత్రుతతో బయటికి వెళ్లినప్పుడు, ఆధార్ కార్డు ని తీసుకు వెళ్లడం మరచిపోయినట్లయితే.. అప్పుడు ఆధార్ కార్డు తో పని ఉన్నట్లయితే.. చాలా ఇబ్బంది పడతారు, అంతే కాకుండా ఆధార్ కార్డు నెంబర్ గుర్తు లేని వాళ్ళు ఇలా చేస్తే సింపుల్ గా ఆధార్ కార్డు ను బయటకు తీసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ఫోన్ ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ను నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు నెంబర్ కు లింక్ అయి ఉండాలి. అప్పుడే మీ ఆధార్ కార్డు నెంబర్ ను తెలుసుకోవడం సులభమవుతుంది.
1). మన మొబైల్ లో ని బ్రౌజర్ లో "UIDIA" వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
2). ఓపెన్ చేసిన తర్వాత"MY AADHAAR" సెక్షన్ లో 3వ లైన్ లో ఉన్న "RETRIEVE LOST OR FORGOTTEN EID/UID మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
3). అప్పుడు పైన చూపిన విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో AADHAAR NO అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
4). అలా ఎంచుకున్న తర్వాత కిందికి వస్తే.. అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి mobile NO, మరొకటి EMAIL ADDRESS ఇందులో ఏదో ఒక దానిని ఎంచుకొని క్యాప్స్ వెరిఫికేషన్ చేసి, సెండ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
5). ఆ తర్వాత మీకు వచ్చిన ఓటీపీ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
6). అలా చేసిన వెంటనే మీ మొబైల్ కు ఆధార్ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది.