బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

Divya

ప్రస్తుతం ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. సిమ్ కార్డు నుండి తాజాగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు ఆధార్ కార్డ్ పక్కాగా ఉండాల్సిందే. ఇక అందుకే చాలా వరకు ఆధార్ కార్డు కు  ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా మాడిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ  ఆధార్ కు లింక్ చేయబడి ఉన్న ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగానే పనులు కూడా జరుగుతున్నాయి. అయితే కొత్తగా ఆధార్ తీసుకుంటున్న వారికి మాత్రమే ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నారు. కానీ గతంలో ఆధార్ తీసుకున్న వారికి ఫోన్ నెంబర్లు లింక్ చేయకుండానే , కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మీరు కూడా గతంలో ఆధార్ కార్డు చేయించుకొని ఉంటే, దానికి ఫోన్ నెంబర్ అనుసంధానం చేయకుండా ఉండింటే, ఆధార్ కార్డు కు మొబైల్ నంబర్ ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
అయితే ఇందుకోసం చేయవలసిందల్లా.. ఆధార్ కార్డు దారులు ముందుగా, మీ సమీపంలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే మీకు ఈ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలియని నేపథ్యంలో, మీకు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ల తెలుసుకోవడానికి ఎం ఆధార్ ఆప్ లేదా 1947 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ఇక ఫోన్ నెంబర్లను మార్చుకోవడానికి లేదా ఫోన్ నెంబర్ ను  లింక్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఇందులో ముఖ్యంగా చేయవలసిందల్లా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఒక్కటే.  ఎవరైతే ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అనుకుంటున్నారో, అలాంటివారు తప్పకుండా దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లకి బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం అభ్యర్థి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలను ఆన్లైన్లో అందుబాటులో కి తీసుకురాలేదు. కాబట్టి సెంటర్లకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సదుపాయాలను బ్యాంకుల్లో కూడా అమలు పరుస్తున్నారు. కేవలం యాభై రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు మొబైల్ నెంబర్ ను ఆధార్ కు లింక్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: