ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్ బై..?

Suma Kallamadi
ప్రస్తుత రోజులలో నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి. ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు. అలా మనిషి ఇంటర్నెట్ మరొక వర్చువల్ లోకాన్ని క్రియేట్ చేసింది. వ్యక్తి జీవనంలో ఒక భాగంగా మారిన ఇంటర్నెట్ వలన ఉపయోగాలు అనేకంగా ఉన్నాయి. అలాగే నష్టం కూడా కొంత ఉందనే వాదన ఉంది. అయితే ఈ ఇంటర్నెట్ లో చాలా మటుకు మైక్రోసాప్ట్ ను వినియోగిస్తున్నారు. తాజాగా మైక్రోసాప్ట్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. నెటిజన్లకు 25 ఏళ్లకు పైగా సేవలందజేసిన తన బ్రౌజర్ ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి నిష్క్రమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

విండోస్ 95తో విడుదలైన ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ పాతికేళ్లకు పైగా నెటిజన్లకు సేవలందచేసిందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్ అప్లికేషన్, విండోస్ 10కు చెందిన కొన్ని వెర్షన్లు 2022 జూన్ 15 నుంచి నిష్క్రమించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ మేనేజర్ సీన్ లిండర్‌సే పేర్కొన్నారు. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ భవిష్యత్తులో విండోస్ 10పై మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో అందుబాటులో ఉంటుందని, ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ కన్నా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మరింత వేగంగా, భద్రంగా, అధునాతన బ్రౌసింగ్ అనుభవాన్ని కలిగిస్తుందని, ఇతర పాత, కొత్త వెబ్‌సైట్లకు, అప్లికేషన్లకు ఇది అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ 2029 వరకు పనిచేస్తుందని తెలిపారు. చాలా మంది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలియడంతో కొందరు సంతోషంగా ఫీలైతే మరికొందరు మాత్రం బాధన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: