‘మైసా’ కోసం ప్రాణం పెట్టిన రష్మిక మందన్న.. ఫ్యాన్స్ షాక్!
‘మైసా’ కేవలం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా. ఇందులో రష్మిక ఒక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం ఆమె ఎంత కష్టపడుతుందో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే!బ్యాంకాక్ వెళ్ళి మరి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో రష్మిక కఠినమైన శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. సుమారు 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో రష్మిక చేసే ఫైట్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.
ఈ సినిమాలో రష్మిక లుక్ చాలా సహజంగా, ‘రా’ (Raw) గా ఉండబోతోంది. ఒక గిరిజన తెగను రక్షించే యోధురాలిగా ఆమె పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించేలా ఉంది. ఇప్పటికే ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘చావా’, ‘సికందర్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, ‘మైసా’తో తనలోని అసలైన యాక్షన్ యాంగిల్‌ను ప్రపంచానికి చూపించబోతోంది.రష్మిక చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్ల క్రేజ్ తగ్గుతుందని అనుకుంటారు, కానీ రష్మిక విషయంలో అది రివర్స్ అయింది. ఆమె రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవల్‌కు చేరుకుంది.