బుల్లిపిట్ట: త్వరలోనే నైట్రోజన్ ప్లాంట్స్ కి బదులుగా ఆక్సిజన్ ప్లాంట్స్..

Divya

కరోనా.. కరోనా.. గత రెండు సంవత్సరాల నుండి ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఎక్కడో చెన్నై లో పుట్టి , ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటి ప్రజలను శత్రువుల కంటే దారుణంగా  భయపెడుతోంది. ఇక దీనికి ఎంతో మంది బలి అవుతున్నారు. మొన్నటి వరకు కరోనా ఫస్ట్ వేవ్  వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింటే, ఇలా తగ్గుముఖం పట్టిందో లేదో అప్పుడే  కరోనా సెకండ్  వేవ్ వచ్చి ఏకంగా ప్రాణాలనే తీసుకెళ్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అంతేకాకుండా ఆస్పత్రులకు బాధితుల తాకిడి పెరిగిపోవడంతో తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది..

ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎంతో మంది రోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు వింటున్న న్యూస్ ఏమిటంటే, చాలామంది ఆక్సిజన్ అందక మరణించారు అనే వార్తలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక అంతే కాకుండా ఆక్సిజన్ నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో, కరోనా రోగులకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరా అందక, వారు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన ఐఐటి సంస్థ పలు నిర్ణయాలు తీసుకుంది..

అదేమిటంటే ,నత్రజనిని ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ గా మార్చుకునేందుకు వీలయ్యే సరికొత్త సాంకేతికతను రూపొందించడమే.. బాంబే ఐఐటి సంస్థ, తమ సంస్థకు చెందిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రేయ క్రయోజనిక్ ఇంజనీరింగ్ లో నిపుణుడు. ఇక ఈయన సహకారం అంతోనే టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ తో కలిసి , ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టారని బాంబే ఐఐటి ఒక ప్రకటనలో వెల్లడించింది.

నత్రజని ఉత్పత్తి ప్లాంట్ లోని అణుసంబంధ కార్బన్  జల్లెడ నుంచి జియో లైట్ కు మార్చడం ద్వారా ఈ నత్రజని ప్లాంట్లను, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను మార్చవచ్చని తెలిపింది. ఇక వాతావరణం నుంచి గాలిని ముడిపదార్థంగా తీసుకొని, ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయగలిగే ఇలాంటి ప్లాంట్ లో భారత దేశమంతటా వివిధ పరిశ్రమలలో ఉన్నాయని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత అధికంగా ఉండడంతో, దీనిని నివారించేందుకు ఆయా ప్లాంట్లు చక్కగా ఉపయోగపడతాయి అని కూడా బాంబే ఐఐటి తెలిపింది. ఈ పరిశోధన కాస్త విజయవంతమైతే ఇక ఆక్సిజన్ కొరతతో ఎవరు చనిపోవాల్సిన అవసరం ఉండదని కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: