బుల్లిపిట్ట : ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ ..
ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సంస్థ తమ కస్టమర్ల కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభిస్తోంది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఈ సారి కూడా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సెల్ ను ప్రారంభించింది. మే రెండవ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభమవుతున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ లపై అనేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అది కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా 15 వేల రూపాయల లోపు లభించే స్మార్ట్ ఫోన్ లను కూడా అమ్మకానికి పెట్టింది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ ల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సేల్ మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లు ,ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు అలాగే హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లకు పది శాతం వరకు తక్షణ రాయితీని కూడా అందిస్తోంది. ఇక ముఖ్యంగా శాంసంగ్, మైక్రోమ్యాక్స్ ఫోన్ల ను 15 వేల రూపాయల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..
సాంసంగ్ గెలాక్సీ F41:
ఈ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రెండు వేల రూపాయల వరకు తగ్గింపు లభించనుంది. ఇక ఈ ఫోన్ 6జీ బీ ర్యామ్ అలాగే 64 జీ బీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభించనుంది. నిజానికి దీని అసలు ధర రూ.14,999 కాగా ,ఈ సేల్ లో దీనిని రూ.12,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా 6.4 ఇంచుల ఫుల్ హెచ్ డి డిస్ప్లేను కలిగి ఉండి, 6000mAh బ్యాటరీ బ్యాక్అప్ ను కూడా కలిగి ఉంది.
మైక్రోమాక్స్ ఇన్ 1:
ఇది ఇది మేడ్ ఇన్ ఇండియా ఫోన్ కావడం వల్ల రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో 6 జీ బీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఇక అంతేకాకుండా 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది.