గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్ల తో ఫోన్..

Satvika
గేమింగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వీరి గేమ్ లకు ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకు కొన్ని ప్రముఖ మొబైల్ కంపెనీలు సరికొత్త ఫీచర్లు ఉన్న ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు గేమింగ్ కూడా ఫోన్ లను విడుదల చేశారు.. ప్రస్తుతం మరో కంపెనీ గేమింగ్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది.గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్‌లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియోసపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. 

ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.. ఇకపోతే ఈ ఫోన్ మొదటి సెల్ ను మాత్రం చైనాలో ఏప్రిల్ 30 న లాంఛ్ చేందుకు చూస్తున్నారు. మన దేశంలోకి ఎప్పుడు తీసుకొస్తారు అన్నది మాత్రం తెలియాల్సి వుంది.. ఈ ఫోన్ హైలెట్స్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం.. 

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌
12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు..అందరికీ ముఖ్యంగా కావలసినది మాత్రం కెమెరా.. విషయానికోస్తే. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. కెమెరా5065 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇకపోతే 67వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది.5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కు కనెక్ట్ అవుతుంది.


6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000)
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300)
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600)
12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500)
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ) 2,699 యువాన్లు (సుమారు రూ.31,100).. ఇవి వేరియంట్ ప్రకారం ప్రైస్.. ప్రస్తుతం స్టోరేజ్ లను ఆధారంగా చేసుకొని నిర్ణయించింది చైనా.. త్వరలోనే భారత్ లో లాంఛ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: