ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ వివో ఎప్పుడు ఏదోక కొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. కాగా, ఇటీవల విడుదల అయిన ఫోన్ యువతను ఆకట్టుకున్న నేపథ్యం లో ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివో వీ21 5జీ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ మనదేశం లో ఏప్రిల్ 29వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ కానుందని వివో గతంలోనే ప్రకటించింది.
కానీ.. సరైన లాంచ్ తేదీని ఇంతవరకు ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక పేజీని అందించారు. ఇందులో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నట్లు వివో టీజ్ చేసింది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు కూడా అందుబాటు లో ఉన్నాయి. కాగా, ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వివో అధికారికంగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటు లో ఉండనుంది. ఈ ఫోన్ ధర గురించి ఇప్పటివరకు తెలియరాలేదు.
వివో వీ20 2021 స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో ప్రస్తుతం రూ.22,990గా ఉంది. వివో వీ21 5జీ ధర దీని కంటే కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది.44 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించనున్నారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. సెల్పీ కెమెరా కోసం ముందువైపు నాచ్‌ను అందించారు.. అంతేకాదు వెనక వైపు కూడా కెమెరాలు అందించారు. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. టీజర్ ను చూసే ఎక్కువ మంది అట్రాక్ట్ అయితే, ఇక ఫోన్ లాంఛ్ అయితే ఇంకా సేల్స్ మాములుగా ఉండవని తెలుస్తుంది..