సోనీ నుంచి మరో కొత్త టీవీ లాంఛ్.. ఫీచర్స్ ఇవే..!

Satvika
ప్రముఖ ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ కంపెనీ సోనీ మరో టీవీని మార్కెట్ లోకి విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ టీవీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.సోనీ 32W830 స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇది 32 అంగుళాల స్మార్ట్ టీవీ. ఇండియన్ మార్కెట్‌లో 32 అంగుళాల సెగ్మెంట్‌లోని టీవీలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్ ఫీచర్స్‌తో సోనీ 32W830 స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని లాంఛ్ చేసింది..


ఇకపోతే ఈ టీవీ ధర విషయానికొస్తే..రూ.31,900. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్స్ ప్లే చేయొచ్చు.. అంతేకాదు వాయిస్ తో రిమోట్ ను ఆపరేట్ చేయవచ్చు. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్స్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, 3.5ఎంఎం ఆడియో ఔట్‌పుట్, వైర్‌లెస్ ఆడియో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 4.2 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 20వాట్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ఉంది. యాప్స్, డేటా కోసం 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.


అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి కావున, రేటు కూడా కళ్లు జిగేల్ మనేలా ఉంటుంది.32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు రూ.12,000 నుంచే లభిస్తాయి. సోనీ లేటెస్ట్‌గా లాంఛ్ చేసిన ఈ స్మార్ట్‌టీవీ 32 ఇంచ్ సెగ్మెంట్‌లో ఖరీదైన టీవీ. మామూలుగా అయితే రూ.31,900 ధరకు ఇండియన్ మార్కెట్‌లో 50 అంగుళాల టీవీ కూడా లభిస్తుంది. అనేక బ్రాండ్స్ తక్కువ ధరకే పెద్ద టీవీలను అందిస్తున్నా సోనీ మాత్రం 32 అంగుళాల టీవీకి రూ.31,900 ధరను ఫిక్స్ చేసింది. సోనీ 32W830 స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని దేశంలోని అన్ని సోనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: