బుల్లిపిట్ట : గూగుల్ పే ద్వారా మీ ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేయడం ఎలానో తెలుసా..?
గూగుల్ పే..ప్రతి ఒక్కరి మొబైల్ లో ఈ యాప్ ఉండనే ఉంటుంది. మనం ఏ చిన్న ట్రాన్సక్షన్ చేయాలన్నా
గూగుల్ పే , ఫోన్ పే , పే టీ ఎమ్ వంటివి వాడుతుంటారు. ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అందులో వాహనదారులు ఎంతో సులభంగా టోల్ గేట్ల చార్జీలను సులువుగా చెల్లించవవచ్చు. కేంద్ర ప్రభుత్వం వాహనదారుల టోల్గేట్ కష్టాలు తొలగించేందుకు సరి కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకువచ్చింది.
అంతేకాకుండా టోల్ గేట్ చార్జీలను చెల్లించేందుకు ఫాస్టాగ్ తప్పనిసరిగా చేసింది. టోల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండటం వల్ల వాహన రద్దీ ఎక్కువ అయిపోతోందని, దీంతో సమయం వృధా అవుతుందని. తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఆటోమేటిక్గా టోల్ గేట్ చార్జీలు కట్ అవుతాయి. వినియోగదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ తో ఖాతాలను సులభంగా రీఛార్జ్ చేసుకునే విధంగా ప్రత్యేక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్ (UPI ) సదుపాయాన్ని ఈ యాప్ ద్వారా ప్రారంభించింది.
మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ని ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం...
1). ముందుగా మీ ఫోన్ లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి.
2). తర్వాత న్యూ పేమెంట్ పై క్లిక్ చేయాలి.
3). కింద చూపించిన ఆప్షన్ లోకి వెళ్లి మోర్ పై క్లిక్ చేయాలి. గూగుల్ పే యాప్ కనిపించకపోతే మళ్లీ మోర్ ఆప్షన్ నొక్కాలి.
4). అక్కడ ఫాస్ట్ ట్యాగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా పాస్టర్ జారీచేసే బ్యాంకును ఎంచుకొని, మీ కారు నెంబరు అందులో ఎంటర్ చేయాలి. తద్వారా మీ గూగుల్ యాప్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
అయితే మీ ఫాస్ట్ ట్యాగ్ ను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే 200 రూపాయల వరకూ ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.100 క్యాష్ బ్యాక్,రూ.100 అమెజాన్ గిఫ్ట్ వోచర్ కింద అందించబడుతుంది.