బుల్లిపిట్ట : మిగిలిపోయిన భోజనంతో విమాన ఇంధనం..!

Divya
మిగిలిపోయిన ఆహారంతో ఏంటి.. విమానాన్ని కావలసిన ఇంధనం తయారు చేయడం ఏంటి.. అని ఆశ్చర్యపోతున్నారా..! లేక ఆలోచిస్తున్నారా..! మీరు ఏం చేసినా అందులో నిజం దాగి ఉంది.. ప్రస్తుత కాలంలో రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంధన ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా ఇంధనం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి..
ఇక ఇదిలా ఉంటే,  మరోవైపు ఆహారాన్ని చాలా మంది ఎక్కువగా వృధా చేస్తున్నారు. ఇక ఈ విధంగా కూడా రోజురోజుకు వృధా పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. మన ఇంట్లోనో,హోటళ్లలో నో, రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో, పార్టీలలో  ఇలా ఎక్కడెక్కడో పెద్ద ఎత్తున ఆహారపదార్థాలు మిగిలిపోతున్నాయి. అయితే వీటిని చాలామంది పడేస్తూ వున్నారు. ఇక పరిశోధకులు ఆలోచనలో పడ్డారు. తరుగుతున్న ఇంధన సమస్యకు, పెరిగిపోతున్న ఆహార వృధా తో చెక్ పెట్టవచ్చా.. అనే అంశంపై శాస్త్రవేత్తలు ఆలోచనలు చేశారు..
అనుకున్న విధంగానే వారు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. మిగిలిపోయిన ఆహారాన్ని విమానయాన ఇంధనంగా మార్చడానికి అమెరికా పరిశోధకులు కృషి చేస్తున్నారు.  ఇందులో భాగంగానే ఇప్పటికే పరిశోధనలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా తయారుచేసిన ఇంధనంతో విమానాల నుంచి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాల తోపాటు గ్రీన్హౌస్ వాయువులను కూడా 165 శాతం వరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు..
ఇక మిగిలిపోయిన ఆహార వ్యర్థాలతో పారాఫీన్ అనే ఇంధనాన్ని తయారు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఇంధనాన్ని విమానాలకు వినియోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అన్ని రకాల విమానాలు ఈ ఇంధనంతో గాల్లోకి ఎగురుతాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్యాటీ యాసిడ్ తో కూడా జెట్ ఇంధనాన్ని తయారు చేయవచ్చనే  విషయాన్ని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్థకు చెందిన డెరేక్ వార్డెన్ అనే ఇంజనీర్ చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా ఆహార వ్యర్థాలతో  తయారు చేయనున్న ఇంధనాన్ని  2023 లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తో కలిసి మొట్టమొదటిసారిగా జెట్ ఫ్లైట్ పై ప్రయోగించనున్నామని వార్డెన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: