బుల్లిపిట్ట : రైలు ఒక్క నిమిషం ఆగడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలుసా..?
ఈ రైలు ప్రయాణం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. చిన్నా పెద్దా ప్రతి ఒక్కరు ఈ రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.. దాదాపుగా ఒక ట్రైన్ కు 30 బోగీలు వరకు ఉండే చాన్స్ ఉంటుందని అందరికీ తెలిసినదే. అంతేకాకుండా మనం చాలాసార్లు ఎక్కి ఉంటాం. ఈ ట్రైన్ చాలావరకు సంబంధిత రైల్వే స్టేషన్ ల లో మాత్రం అగుతూ ఉంటుంది. అది కూడా ప్రయాణికులను ఎక్కించుకోవడం కి మరియు దింపడానికి మాత్రమే ఆపుతూ ఉంటారు . అంతేకానీ మధ్యలో ఏ కారణం చేత అయిన సరే ట్రైన్ ఆగిపోవడం మనం సామాన్యంగా గమనించి ఉండము. కానీ ఒక్క ట్రైన్ కదిలింది తర్వాత దాని నిర్దిష్ట ప్రదేశం వచ్చే వరకు రైలు ఆపకూడదు అన్న రూల్ కూడా ఉంది . కానీ కదిలే ట్రైన్ ఎలాంటి కారణం లేకుండా ఆగాల్సి వస్తే మాత్రం ఇండియన్ రైల్వే కు భారీ నష్టం జరుగుతుందట. ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.
ఆర్టీఐ సమాచారం ప్రకారం డీజిల్ ఇంజన్ ట్రైన్ ఒక్క నిమిషం ఆగితే రూ.20,401 నష్టం వాటిల్లుతుందట. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.20,459 నష్టం వాటిల్లుతుంది. అలాగే గూడ్స్ ట్రైన్ విషయానికి వస్తే, డీజిల్ ట్రైన్ ఒక్క నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.13,392 నష్టం వస్తుందట.
అదేవిధంగా ట్రైన్ ఆగితే అది మళ్ళీ స్పీడ్ పుంజుకోవడానికి కనీసం మూడు నిమిషాల సమయం అవుతుందట. ఈ టైంలో డీజిల్ లేదంటే ఎలక్ట్రిక్ సిటీ ఎక్కువ ఖర్చవుతుంది. అంతేకాకుండా ఒక ట్రైను ఆగిపోతే, దీని వెనక వచ్చే అన్ని ట్రైన్స్ ను కూడా ఆపాల్సి ఉంటుంది.
అలా ఆపినప్పుడు ఎంత నష్టం వాటిల్లుతుందో మీరే లెక్కసుకోండి. అంతే కాకుండా ట్రాక్ లైను కూడా మళ్లీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ట్రైన్స్ ఆలస్యమైతే ప్యాసింజర్ లకు మళ్లీ డబ్బులు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్క ట్రైన్ ఆకారణంగా ఒక్క నిమిషం ఆగితే, ఆ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందట. ఇలా ట్రైన్ ఆగడం వల్ల ఇండియన్ రైల్వే కు ఎంతో భారీ నష్టాన్ని చేకూరుస్తుంది.