బుల్లి పిట్ట :ఓటేసేకి వెళ్తున్నారా..? ఓటు కార్డు లేదా..? అయితే ఇవి ఉంటే చాలు..!

Divya

ప్రతి భారతీయ పౌరుడికి ఉండవలసినది  ఓటర్ కార్డ్. ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఓటర్ ఐడి కచ్చితంగా ఉండాలా..? లేని వారు ఏం చేయాలి..అనే పలు అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి వారు ఓటు హక్కు ని ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

ఓటర్ కార్డు లేకుండా ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డులో పేరు ఉన్నవారంతా ఓటర్ ఐడి లేకున్నా, ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గుర్తింపు కార్డు ను  చూపాలని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఓటర్ గుర్తింపు కార్డు కు ప్రత్యామ్నాయంగా ఈ గుర్తింపు కార్డులు ఇవే :
1).  ఆధార్ కార్డు,
2).  డ్రైవింగ్ లైసెన్స్,
3). ఫోటో తో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు,
4). పాస్పోర్ట్,
5). ఫోటో తో కూడిన బ్యాంక్ పాస్ బుక్,
6). పాన్ కార్డు,
7) ఆర్.జీ.ఐ,ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డ్,
8) హెల్త్ కార్డు,
9). జాబ్ కార్డు,
10). రేషన్ కార్డు,
11). ఫోటో తో కూడిన పింఛన్ డాక్యుమెంట్,
12). కుల ధ్రువీకరణ పత్రం,
13). ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు,
14). అంగవైకల్యం సర్టిఫికెట్,
15). ఆర్మ్స్ లైసెన్స్ కార్డ్ ,
16). పట్టాదారు పాస్ బుక్,

అంతేకాకుండా ప్రజల సౌలభ్యం కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను కూడా విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే వారు, తమ ఓటర్ స్లిప్పులు పొందడంతోపాటు,  మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ ద్వారా కూడా తెలుసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్,మున్సిపాలిటీల్లో ఓటర్ స్లిప్పులను బూత్ లెవల్ అధికారులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఓటర్ స్కీం మొబైల్స్ ఎక్కువ ఉండడం వల్ల అరచేతులలో ఓటర్ పోలింగ్  బూత్ లో ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్ ను రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: