భారత్‌లో ఆ కంపెనీ టీవీ లాంఛ్..ధర ఎంతంటే?
షియోమి భారత్‌లో ఈనెల 17న రెడ్‌మీ టీవీని లాంఛ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్ తయారీలో పేరొందిన షియోమి గత కొన్నేండ్లుగా భారత్‌లో ఎంఐ సబ్‌బ్రాండ్ కింద టీవీలను విక్రయిస్తోంది. తాజాగా టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించే ప్రణాళికలో భాగంగా రెడ్‌మి టీవీలను పెద్ద ఎత్తున మార్కెట్‌లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండే ఉత్పత్తులు, నూతన టీవీలను ప్రవేశపెట్టనుంది. త్వరలో ఎక్స్‌ఎల్ సైజ్ స్మార్ట్‌టీవీ లాంఛింగ్‌కు సంబంధించి రెడ్‌మి ఇండియా తన సామాజిక మాధ్యమాలను వేదికగా ఒక టీజర్ ను విడుదల చేసారు.
మొట్ట మొదటి భారీ స్క్రీన్ తో ఈ టీవీ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 17 న ఈ టీవీ ను లాంఛ్ కానుంది.ప్రస్తుతం రెడ్‌మి టీవీలు షియోమి హోం మార్కెట్ అయిన చైనాలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంఐ బ్రాండ్‌తో పోలిస్తే యువ ప్రేక్షకులే లక్ష్యంగా రెడ్‌మి టీవీ అత్యాధునిక ఫీచర్లతో రానుందని షియోమి ఎగ్జిక్యూటివ్ ప్రకటించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొనే విధంగా ఈ టీవీని మార్కెట్ లోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈశ్వర్ నీలకంఠన్ పేర్కొన్నారు. ఇక చైనా మార్కెట్‌లో గతనెల రెడ్‌మి మ్యాక్స్ 86 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రెడ్‌మీ కే 40 సిరీస్‌తో పాటు లాంఛ్ చేసింది. రెడ్‌మి మ్యాక్స్ అల్ట్రా హెచ్‌డీ (4కే) టీవీ రూ 91,000కు అందుబాటులో ఉంది.