అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లు ఇవే.. అదిరిపోలే..!!

Satvika
ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు గడిచిన ఏడాది లో నగదును అందించారు. ఇప్పుడేమో విద్యార్థుల భవిష్యత్ కోసం ల్యాప్ టాప్ లను అందించాలని అనుకున్నారు. కంప్యూటర్ స్కిల్స్ పెంచడంతో పాటు వారు ఆన్ లైన్ క్లాసులు వినడం కోసం వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అప్పుడు ప్రకటించారు. కరోనా వల్ల నా నష్ట పోయిన విద్యార్థుల్ని మళ్లీ తిరిగి భవిష్యత్ ను నిలబెట్టడం కోసం ఇలాంటి ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు జగన్అమల్లోకి తీసుకొచ్చిన పథకాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా లబ్ది పొందాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






అమ్మఒడి ల్యాప్‌టాప్‌లు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ ల్యాప్ టాప్ ఫీచర్లను కూడా ప్రకటించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ధర కూడా రూ.25,000 నుంచి రూ.27,000 మధ్య ఉండనుంది. ఇకపోతే ఈ ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాలు వ్యారెంటి కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..



8వ తరగతి పైబడిన విద్యార్థులందరికీ వారి పాఠ్యాంశాల్లో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాంను కూడా చేర్చనున్నారు. అంటే 8వ తరగతి నుంచే కంప్యూటర్ ఉపయోగించడాన్ని పూర్తిగా నేర్పిస్తారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అన్నిటిలో చురుగ్గా ఉండటానికి ఈ ల్యాప్ టాప్ లను అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇకపోతే రూ.25,000 నుంచి రూ.27,000 ఖరీదైన ల్యాప్‌టాప్‌లను కేవలం రూ.18,500కే అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్ దీని ఖరీదును మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కొత్త పథకం విద్యార్థులకు మంచి  చేకూరుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలోనే  ల్యాప్ ట్యాప్ లను విద్యార్తులకు అందింస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: