సరికొత్త ఆఫర్..రీఛార్జ్ చేసుకుంటే కారు ఇంటికి వస్తుందట!
అదేంటి? రీఛార్జ్ చేసుకుంటే కార్ ఇంటికి రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా! నిజమండీ. రీఛార్జ్ చేసుకుంటే నిజంగానే కారు ఇంటికి వస్తుందట.మనలో చాలా మంది కారు కొనాలనుకుంటున్నారు. అలాంటి వారికో శుభవార్త. మీరు కారు కొనకుండానే మీ ఇంటికి కారు తీసుకెళ్లవచ్చు.ఎలా అనుకుంటున్నారా? ఇందుకోసం మీరు సింపుల్గా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.రీఛార్జ్ కీ కారు ఇంటికి రావడానికీ సంబంధం ఏంటి?అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదృష్టం మిమ్మల్ని వరిస్తే, తప్పకుండా మీరు ఇంటికి కారు తీసుకెళ్లవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళితే రూ.500 రూపాయలు రీఛార్జ్ చేస్తే చాలు. కారు ఇంటికి వస్తుంది.అయితే ఇందుకోసం మీరు టాటాస్కై యూజర్ లై ఉండాలి.ఇలా మీరు మీ టాటా స్కై అకౌంట్ కు రూ.500 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీ మొబైల్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.ఇందులో ఒక లింక్ ఉంటుంది.ఆ లింక్ పై క్లిక్ చెయ్యాలి.అలా క్లిక్ చేయగానే మీకొక సులభమైన ప్రశ్న కనబడుతుంది. ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే, ఖచ్చితంగా ఒక కారుని ఇంటికి తీసుకెళ్లవచ్చు.
దేశవ్యాప్తంగా టాటాస్కై యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.అయితే ఫిబ్రవరి 6వ తేదీ లోపే మీ టాటా స్కై రీఛార్జ్ చేసుకోవాలి. మీరు టాటా స్కై ఆఫర్ గెలుపొందితే, టాటా మోటార్స్ కు చెందిన టియాగో కారును ఇంటికి పట్టుకెళ్ళవచ్చు. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ విలువ రూ.4.7 లక్షల రూపాయలుగా వుంది.
మీరు టాటా స్కైకి రూ.500 రూపాయలతో రీఛార్జ్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ డిస్ప్లేకనిపిస్తుంది. దీని పై క్లిక్ చేసి పార్టీసిపేట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఒక ప్రశ్న, రెండు సమాధానాలు కనిపిస్తాయి. ఆ ప్రశ్నకు సరైన సమాధానం మీరు ఎంచుకుని,సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అంతే సింపుల్.ఆ తర్వాత టాటా స్కై లక్కీ డ్రా తీసుకోండి.మీరు రోజుకు రెండు సార్లు రీఛార్జ్ చేస్తే, రెండు సార్లు లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. 30 రోజులకు గాను 30 మంది లక్కీ విజేతలకు ముప్పై కార్లను ఇవ్వడానికి టాటా గ్రూప్ సిద్ధంగా ఉంది.