దసరా దీపావళి పండుగలకు చాలా ప్రత్యేకత ఉంది.. ఈ మేరకు వివిధ కంపెనీలు కొత్త వస్తువులను మార్కెట్ లోకి వదులుతారు.. అంతే కాదు..నెల ఆఫర్ల తో జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కంపెనీ యాజమాన్యాలు... ముఖ్యంగా మొబైల్ కంపెనీ వాళ్ళు .. ముందు వచ్చిన ఫోన్ కంటే తర్వాత వచ్చిన ఫోన్ లో కొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తుంది. అంతేకాదు అదిరిపోయే ఫీచర్లు కూడా తెస్తూ తెగ హంగామా చేస్తారు. నిన్నటి వరకు దసరా ఆఫర్ల పేరుతో మార్కెట్ లో సందడి చేసిన ఫోన్ల కంపెనీలు దీపాలికి కి రెడీ అవుతున్నాయి..
తాజాగా రెడీ మీ కంపెనీ మరో కొత్త ఆఫర్ల తో ముందుకొచ్చింది. మార్కెట్ లో కనీసం ఫోన్ ఇలా ఉంటుంది అనే టాక్ ఎక్కడా కూడా నడవలేదు..కానీ ఆ ఫోన్ ప్రత్యేకతలు ఇవే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. రెడ్ మీ కే30ఎస్ త్వరలో లాంచ్ కానుంది. రెడ్ మీ కే30 సిరీస్‌లో కొత్తగా లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ కే30 అల్ట్రా కంటే చవకగానే రానుంది. ఈ ఫోన్ అక్టోబర్ 27వ తేదీన లాంచ్ కానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది..
గతంలో వచ్చిన ఫోన్ ను ముందే అందరూ పసి కట్టడంతో ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ సదుపాయాలు ఉండటంతో జనాలు ఈ ఫోన్ ను ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఈ కంపెనీ ఒక శుభవార్తను చెప్పింది.వెబ్ సైట్లో కనిపించిన దాని ప్రకారం ఈ ఫోన్ ఎంఐ 10టీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. .. 64 మెగా పిక్సెల్ అది. బ్యాటరీ సామర్థ్యం 4900 ఎంఏహెచ్‌ను కలిగి ఉంటుంది ఈ ఫోన్ మరో రెండు రోజులలో మార్కెట్ లోని విడుదల కానుంది. ఎనిమిది కలర్స్ లో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అక్టోబర్ 27 న ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం..