మళ్ళీ లీకైన సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోటోలు!

Suma Kallamadi
సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోన్ ఫీచర్లతో కాస్త తక్కువ ధరకు మార్కెట్లోకి విడుదలవ్వనున్న సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ మొబైల్ ఫోన్ విడుదల తేదీపై చాలా రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్లతో కొంత ఎక్కువ ధరకి లభించనున్న సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఇటీవలే థాయిలాండ్ లో టెనా సర్టిఫికెట్ ను సాధించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. వెరిజోన్ అనే ఒక వెబ్ సైట్ లో గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోటోలు కనిపించాయని టెక్ నిపుణులు వెల్లడించారు. బ్లూ, మింట్, రెడ్, పింక్ రంగులలో గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ లభించనుందని కూడా తెలుస్తోంది. ఎన్బీటీసీ పొందిన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ అతి త్వరలోనే విడుదల కానున్నదని తెలుస్తోంది.


గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుందని ఇప్పటివరకు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 990 SoC చిప్సెట్ ఇవ్వబడింది అని... అది స్నాప్‌డ్రాగన్ 865 కు సమానంగా సమర్థవంతంగా శక్తివంతంగా పని చేయగలదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.  ఇది 6GB ram + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం ఒకే ఒక వేరియంట్ లోనే  విడుదల కానుందట.


ఇకపోతే ఫోటో ప్రియుల కోసం కూడా సాంసంగ్ డెవలపర్లు ఈ ఫోన్లో సమర్థవంతమైన కెమెరాలను అమర్చారు అని తెలుస్తోంది. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాలతో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఈ ఫోన్ లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ లభించడంతోపాటు 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇవ్వబడుతుంది.  వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపి 68 రేటింగ్,  అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి కళ్ళు చెదిరే ఫీచర్లను కూడా ఈ స్మార్ట్‌ఫోన్ లో ఇవ్వబడ్డాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: