బుల్లిపిట్ట: పోకో ఎం2 ప్రో ధర, ఫీచర్లు ఇవే...

Suma Kallamadi
పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజే మన దేశంలో  జరగనుంది. ఈ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మరి దాని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకోవాలంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు ఈ సేల్  ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ని మీరు ఫ్లిప్ కార్ట్ లో కూడా కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ లో మరి విశేషం ఏమిటంటే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండటం. ఇది కొనుగోలుదారులని బాగా ఆకర్షిస్తుందని చెప్పాలి.

 
పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్  ధర విషయానికి వస్తే మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999 ఉంది. అదే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. అలానే ఫోన్ కలర్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి.


6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 కూడా ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ , 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా  16 మెగాపిక్సెల్ తో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు రూ.1,556 నుంచి ప్రారంభం కానున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: