టెక్నాల‌జీ: రెండు స్మార్ట్‌ఫోన్లు విడుద‌ల చేసిన హాన‌ర్‌.. ధర రూ.5,999 నుంచి!!

Kavya Nekkanti
భార‌త్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బ‌డ్జెట్ ఫోన్ల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు కంపెనీలు సామాన్యుల‌కు చేరు‌వ అయ్యేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌డ్జెట్ ధ‌ర‌లోనే ఫోన్లు విడుద‌ల చేస్తూ ఆక‌ర్షిస్తుంటాయి. తాజాగా ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ హానర్ కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లోనే రెండు కొత్త ఫోన్ల‌ను లాంచ్ చేసింది. అవే హానర్ 9ఏ, హానర్ 9ఎస్. ఈ ఫోన్ల సేల్ ఆగస్ట్ 6న ప్రారంభం అవుతుంది. ఇక హానర్ 9ఎస్ ధర రూ.6,499 కాగా, హానర్ 9ఏ ధర రూ.9,999గా నిర్ణ‌యించారు.
అయితే ఫస్ట్ సేల్‌లో కొనేవారికి హానర్ 9ఎస్ రూ.5,999 ధరకు, హానర్ 9ఏ రూ.8,999 ధరకు లభిస్తుంది. హానర్ 9ఎస్ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. 5.45 అంగుళాలు డిస్‌ప్లేను ఇందులో అందించారు. 2జీబీ ర్యామ్‌.. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ ఎంటీ6762ఆర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. కెమెరా విష‌యానికి వ‌స్తే.. హానర్ 9ఎస్‌లో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అందించ‌గా.. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమ‌ర్చారు. అలాగే  3,020ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 + మ్యాజిక్ యూఐ 3.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్‌, బ్లూ రంగుల్లో ఈ అందుబాటులోకి రానుంది.
హానర్ 9ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.3 అంగుళాలు డిస్‌ప్లేను ఇందులో అందించారు. 3జీబీ ర్యామ్‌.. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ ఎంటీ6762ఆర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. కెమెరా విష‌యానికి వ‌స్తే.. హానర్ 9ఏ వెన‌క‌వైపు 13+5+2 మెగాపిక్సెల్ సామ‌ర్థ్యంతో మూడు కెమెరాల‌ను అందించారు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ముందువైపు అమ‌ర్చారు. అలాగే 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, డ్యూయెల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 + మ్యాజిక్ యూఐ 3.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్‌, బ్లూ రంగుల్లో ఈ అందుబాటులోకి రానుంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ ఉండదు. యాప్స్ కోసం హువావే రూపొందించిన యాప్ గ్యాలరీ ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: