టెక్నాలజీ: వావ్.. కేవలం రూ.5,499కే.. శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్!!
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన ఫీచర్లతో ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తూ.. మిగిలిన కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది శాంసంగ్. ఇక తాజాగా కూడా బడ్జెట్ ధరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఎం01 సిరీస్ లో గెలాక్సీ ఎం01, గెలాక్సీ ఎం01ఎస్ స్మార్ట్‌ఫోన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పడు ఇదే సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ విడుదల చేశారు.
ఇందులో రెండు వేరియంట్లను అందించింది శాంసంగ్. మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో వెనకవైపు ఒక కెమెరాను మాత్రమే అందించారు. సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 5.3 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 1జీబీ, 2జీబీ ర్యామ్.. 16జీబీ, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించగా.. ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 11 గంటల బ్యాకప్ లభిస్తుంది. అలాగే బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌లో యాప్స్ అన్నీ చాలా తక్కువ సైజ్‌లో ఉంటాయి. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ధర విషయానికి వస్తే.. 1జీబీ+16జీబీ- రూ.5,499గా, 2జీబీ+32జీబీ- రూ.6,499గా నిర్ణయించారు. కాగా, జూలై 29 నుంచి సాంసంగ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.