టెక్నాల‌జీ: అతి త‌క్కువ ధ‌ర‌కే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన `రెడ్‌మీ నోట్ 9`!!

Kavya Nekkanti

భార‌త్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇటీవ‌ల పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో రోజుకో స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల అవుతుండ‌టం, అది కూడా బ‌డ్జెట్ ధ‌ర‌ల్లోనే ఉండ‌డం ఆక‌ర్షించే విష‌యం. ఇక స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమీ మనదేశంలో మరో బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ నోట్ 9. ఇప్ప‌టికే నోట్9 సిరీస్‌లో రెడ్‌మి నోట్9 ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మ‌రో బ‌డ్జెట్ ఫోన్ విడుద‌ల అయింది.

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్,  5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వంటి ప్ర‌త్యేక‌త‌లు రెడ్‌మీ నోట్ 9లో ఉన్నాయి. ఇక స్పెసిఫికేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. రెడ్‌మీ నోట్ 9లో 6.53 అంగుళాలో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించింది షావోమీ. 4జీబీ, 6జీబీ ర్యామ్‌, 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 48+8+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండ‌గా.. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.  5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 4జీబీ+64జీబీ- రూ.11,999గా, 4జీబీ+128జీబీ- రూ.13,499గా మ‌రియు 6జీబీ+128జీబీ- రూ.14,999గా నిర్ణ‌యించారు. అలాగే ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్ క‌ల‌ర్స్‌తో ఈ స్మార్ట్ అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్9లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెన‌క‌వైపు అందించారు. కాగా, జూలై 24న రెడ్‌మి నోట్9 అమ్మకాలను ప్రారంభించనుంది. ఈ ఫోన్ ఎమ్‌ఐ.కామ్, అమెజాన్ ఇండియాలో లభిస్తుంది. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: