83 సంవత్సరాల పాటు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం ఉచితంగా పొందండి..!

Kothuru Ram Kumar

ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం... మీరు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌కు 83 సంవత్సరాలు లేకపోతే ఏకంగా 1,000 నెలల సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ చేజిక్కించుకునేందుకు మీరు చేయాల్సిందల్లా “ది ఓల్డ్ గార్డ్” వీడియోగేమ్‌లో అత్యధిక స్కోరు సాధించడమే.


నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌ చార్లీజ్ థెరాన్ నటించిన ది ఓల్డ్ గార్డ్ మూవీని ఇటీవల విడుదల చేసింది.  కొత్త నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌ను అందరూ గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో, ఈ  స్ట్రీమింగ్ సేవా సంస్థ “ఇమ్మోర్టల్( చనిపోయేంత వరకూ చూడగల)” నెట్‌ఫ్లిక్స్ ఖాతాను అందిస్తోంది.  వాళ్లు చెప్పిన గేమ్ లో అత్యధిక స్కోరు సాధిస్తే వినియోగదారులు 83 సంవత్సరాల నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని పొందుతారు. ఇది అత్యుత్తమ ఆఫర్ అని నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌ చెబుతుంది. ఇకపోతే ఓల్డ్ గార్డ్ గేమ్‌లో... శత్రువుల సమూహాలను సంహరించాల్సి ఉంటుంది. 


ఓల్డ్ గార్డ్ గేమ్ వెబ్ సైట్ లోనే ఆడుకోవచ్చు. ఈ గేమ్ లో ది ఓల్డ్ గార్డ్ మూవీలోని ప్రధాన పాత్రలో మీరు ఆడాల్సి ఉంటుంది.  ఒక పెద్ద డబుల్ బ్లేడెడ్ గొడ్డలి అయిన ఒక చేతి ఆయుధాన్ని ఉపయోగించి సాధ్యమైనంత ఎక్కువ మంది శత్రువులను చంపడమే ఈ గేమ్ యొక్క లక్ష్యం. ఇంకొక విషయం ఏమిటంటే, ఓల్డ్ గార్డ్‌లో మీరు ఆడే పాత్ర చనిపోవడం అస్సలు జరగదు కానీ శత్రువులు మిమ్మల్ని బాగా కొడుతుంటే మీ పాత్ర ఆడే వేగం తగ్గిపోతుంది.  కాబట్టి మీరు దెబ్బతినకుండా ఉండటానికి, శత్రువులను త్వరగా చంపడానికి ప్రయత్నించాలి.


నెట్‌ఫ్లిక్స్ దీర్ఘకాలపు ఖాతా పొందడం కోసం ఎవరైనా ఇప్పుడు  ఓల్డ్ గార్డ్ గేమ్ ఆడుకోవచ్చు. జూలై 19 వరకు గేమ్ ఆడుకునే వెసులుబాటు కల్పించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సమయంలో ఆట లో అత్యధిక స్కోర్ సాధించిన వ్యక్తికి 83 సంవత్సరాల ఉచిత నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వంతో అవార్డు ఇవ్వబడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పోటీ అమెరికా లోని నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు మాత్రమేనట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: