టెక్నాల‌జీ: ఈ వింత వింత వెబ్ సైట్ల‌ను మీరెప్పుడైనా చూశారా..?

Kavya Nekkanti

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను నానా తిప్ప‌లు పెడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెంది.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌కు బ‌లి తీసుకుంటుంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య 23 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌ర‌ణాల సంఖ్య ల‌క్షా 55 వేలు దాటేసింది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వాలు క‌రోనాను నియంత్రించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యాయి. 

 

అయితే ఇంట్లో ఉంటున్న చాలా మంది ఫోన్లు లేదా టీవీ ఇలా ఏదో ఒక‌టి చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే ఎన్ని ఉన్నా ఏదో తెలియని బోర్ కొడుతుంది. ప్రతీ నిమిషమూ భారంగా గడుస్తుంది. అలాంటి టైమ్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే వింత వింత వెబ్ సైట్ల‌పై ఓ లుక్కేయండి.  వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపోతే, బోర్ నుంచీ రిలీఫ్ ఇస్తూ అవి కాస్త ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తాయి. 

 

అందులో ముందుగా..ఫేస్ ఇంటరాక్టివ్.. ఇదో చిత్ర‌విచిత్ర‌మైన వెబ్ సైట్‌. ఇందులో ఓ మ‌హిళ ఫేస్ క‌నిపిస్తుంది. అయితే ఆమె కళ్లు, ముక్కు, పెద‌వుల‌పై మౌస్‌తో క్లిక్ చేస్తే  హావభావాలు పలికిస్తుంది. కర్సర్‌ను ఎన్ని రకాలుగా కదపగలిగితే అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటుంది. https://www.alterfin.dds.nl/dominique/index.html

 

బోర్ పరారే.. ఇదో వండ‌ర్‌ఫుల్‌ వెబ్‌సైట్. ఎందుకంటే ఇందులో ఓ పిల్లి తబలా, పియానో ఇలా రకరకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించగలదు. మనం కీ బోర్డులో కీలను, నంబర్లనూ టైప్ చేస్తుంటే పిల్లి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. అది మ‌న‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. https://bongo.cat

 

పిల్లితో పియానో వాయించండిలా.. ఇది కూడా ఓ అద్భుత‌మైన వెబ్‌సైట్‌. ఇందులో పిల్లి పియానో పట్టుకుని ఉంటుంది. ఆ పియానో కీలపై మనం కర్సర్‌తో క్లిక్ చేస్తూ ఉంటే, రకరకాల పిల్లు కూతలు వినిపిస్తాయి. ఇక అక్క‌డ క‌నిపించే పిల్లి నచ్చకపోతే పక్కనున్న లిస్టులోంచీ వేర్వేరు పిల్లుల్ని మార్చుకునే అవ‌కాశం కూడా ఉంది. మ‌రి దీనిపై ఓ లుక్కేయండి. https://catcordion.sergethew.com

 

గ‌తంలోకి ప‌దండిలా.. ఇందులో 1970ల్లో టీవీ ఎలా ఉంటుంది? ఏయే కార్యక్రమాలు వస్తాయి? వంటి వాటిని వర్చువల్ టీవీలో చూడొచ్చు. మీకు మీరుగా ఛానెల్స్ మార్చవచ్చు కూడా. సంవత్సరాలు కూడా మార్చేయవచ్చు. వాల్యూమ్ ఎడ్జస్ట్‌మెంట్లు కూడా ఇందులో ఉండ‌డం విశేషం అని చెప్పుకోవాలి. https://www.my70stv.com

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: