అతి త‌క్కువ ధ‌ర‌లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే..!!

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో అంద‌రూ రీఛాన్జ్ ప్లాన్స్‌కే ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే మ‌రి అతి త‌క్కువ ధ‌ర‌లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్‌ను చాలా మంది కావాల‌నుకుంటారు. అయితే అలాంటి వారి కోసం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ మంచి అవ‌కాశాన్ని అందిస్తుంది. కేవ‌లం రూ. 200 లోపే  ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. మ‌రి ఆ ప్లాన్స్ ఏంటి..? వాటి ధ‌ర మ‌రియు బెనిఫిట్స్ ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఎయిర్‌టెల్‌ రూ.179 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా కూడా వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు భారతీ ఆక్సా లైఫ్ నుంచి రూ.2 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది.

 

ఎయిర్‌టెల్‌ రూ.149 ప్లాన్‌.. ఎయిర్‌టెల్‌లో రూ.149 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

 

వొడాఫోన్‌లో రూ.129 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా ఉప‌యోగించుకోవ‌చ్చ‌. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. మ‌రియు రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 

 

వొడాఫోన్‌లో రూ.149 ప్లాన్‌.. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. మ‌రియు రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 

 

జియో రూ.129 ప్లాన్.. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ వ‌స్తుంది. 2 జీబీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. 

 

జియో రూ.149 ప్లాన్.. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల వేలిడిటీ పొందొచ్చు. రోజుకు 1జీబీ చొప్పున 24 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 300 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. కాబ‌ట్టీ ఈ ప్లాన్స్‌లో మీకు ఏది బెస్టో మీరూ ఎంచుకుని రీఛార్జ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: