టెక్నాల‌జీ: గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోండిలా..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం కాలంలో వాహనాలను ఇకపై ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయటం కుదరదు. అంతేగాక, ఎక్కడ వాహనం పార్కింగ్ చేయాలన్నా ప్రైవేటు సంస్థలకు ఛార్జీలు చెల్లించాల్సిందే. అయితే రోజురోజుకి పెరిగిపోతున్న రద్దీ, వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు అనేక చ‌ర్చ‌లు తీసుకుంటున్నారు. ఇక కారు లేదా ఏదైనా నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉన్న వారు ఏదైనా ప్రదేశంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య పార్కింగ్ దొరక్కపోవడం.

ఎప్పుడైనా తెలియ‌ని ప్ర‌దేశానికి వెళ్లిన‌ప్పుడు ఎక్కడ పార్క్ చేయాలో తెలియకపోవడంతో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే మీరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న ప్రదేశంలో కార్ పార్కింగ్ సులభంగా అందుబాటులో ఉందో లేదో నిర్ధారించడానికి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యొక్క కొత్త ఫీచర్ మీకు సహాయం చేస్తుంది. ఈ యాప్ ను ఉపయోగించి మీరు తెలియని కొత్త ప్రదేశాలలో కూడా పార్కింగ్ యొక్క స్థలాన్ని కొనుగొనవచ్చు.

మ‌రి దీన్ని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. అయితే అందుకు ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి గమ్యాన్ని నమోదు చేయండి. ఇప్పుడు దిగువ నుండి 'డైరెక్షన్' బటన్ నొక్కండి. 'ప్రారంభించు' బటన్‌ను చూపించే దిగువ పట్టీని పైకి తీసుకురండి. ఈ గమ్యస్థానం సమీపంలో పార్కింగ్ సాధారణంగా సులభం కాదు అని పేర్కొన్న `పి` గుర్తు ఉంటుంది. అప్పుడు మీరు అక్క‌డ పార్క్ చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: