బుల్లిపిట్ట: మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే ఇలా చేస్తే సరి..!
ఇంటర్‌నెట్ వినియోగం విస్తృతం అయినప్పటి నుంచి సోషల్ నెట్‌వర్క్‌ల యూజర్లు పెరిగారు. కాలేజీ యువత నుంచి పండు ముదుసళ్ల వరకూ.. గృహిణుల మొదలు ఉద్యోగినుల వరకూ.. బిజినెస్ చేసే వారితో పాటు బేకార్‌గా తిరిగేవారి దాకా.. అందరి వద్దా స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ నెట్‌వర్క్‌ల్లో ఫేస్‌బుక్ ఒకటి. గత ఏడాదిలో ఫేస్‌బుక్ వినియోగం బాగా పెరిగింది. యూజర్ల సంఖ్య పెరిగేందుకు వీలుగా ఫేస్‌బుక్ లైట్ అందుబాటులోకి వచ్చింది.
ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రంగా ఉన్నా ఫేస్‌బుక్‌ను సులభంగా యాక్సెస్ చేసే వెసులుబాటుఉండటంతో ఎక్కువ మంది దీన్ని వినియోగించడం మొదలు పెట్టారు. ఇక ఎవరైనా తమ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే లైక్స్ కోసం తెగ ఆరపడుతుంటారు. అయితే మరి మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించటం లేదా..? బాధపడకండి. మీ ఫేస్‌బుక్ పేజీలకు ఎక్కువ లైక్స్‌ను సంపాదించిపెట్టే అద్భుతమైన ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఫేస్‌బుక్ పేజీని ట్విట్టర్‌కు కనెక్ట్ చేయటం ద్వారా లైక్స్‌ను పెంచుకోవచ్చు.
అలాగే ఫేస్‌బుక్ పేజీని ప్రొఫైల్‌కు లింక్ చేయటం ద్వారా మీ ఫేస్‌బుక్ పేజీని ప్రొఫైల్ క్రింద కనపించే అబౌట్ సెక్షషన్ ఎంప్లాయిమెంట్ స్థానంలో లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు. మరియు మీ ప్రయోషన్ వేగవంతంగా విస్తరించాలంటే ఫేస్‌బుక్ లైక్స్‌ను కొనుక్కోండి. మీరు మల్టిపుల్ ఫేస్‌బుక్ పేజీలను కలిగి ఉన్నట్లయితే పేజీలను ఇంటర్ లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.