టెక్నాల‌జీ: పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని ఉప‌యోగాలో చూడండి..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా చాలా మంది కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన‌ప్పుడు పాత స్మార్ట్‌ఫోన్ల‌ను ప‌క్క‌న పాడేస్తుంటారు. మ‌రికొంద‌రు పాత ఫోన్‌లను సగం ధరకు అమ్మేస్తుంటారు. అయితే పాత స్మార్ట్‌పోన్ల‌తో ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. కొంచం వినూత్నంగా ఆలోచించినట్లయితే మీ పాత ఫోన్‌ను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. మీ పాత స్మార్ట్‌ఫోన్ ను సెక్యూరిటీ కెమెరాలా ఉపయోగించుకోవచ్చు. పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్‌లా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాలా మార్చుకుని మీ ఇంటికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. 

 

ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాలా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లో వై-ఫై సమస్యలు ఉన్నట్లయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫై ఎక్స్‌టెండర్‌లా మార్చుకోవచ్చు. ఇందుకు కొన్ని యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్‌లా మార్చుకుని మీ కొత్త ఫోన్‌కు ఛార్జింగ్ సమకూర్చుకోవచ్చు. యూఎస్బీ ఆన్ దగో కేబుల్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.

 

అదే విధంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్నెస్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు. మీ పాత డివైస్‌ను ఇలా మార్చే క్రమంలో ఫోన్‌ను మొత్తం రీఫార్మాట్ చేసి మ్యూజిక్ ఇంకా ఫిట్నస్ ట్రాకర్ యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకుంటే స‌రిపోతుంది. గూగుల్ హ్యాంగ్ అవుట్స్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌ను ఉపయోగించి మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: