
తెలంగాణలో ఆ జిల్లాను వణికిస్తున్న భూకంపాలు..?
ప్రధానంగా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల పరిధిలోని పదికిపైగా గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. చింతలపాలెం మండల కేంద్రంతో పాటు, దొండపాడు, రామాపురం గ్రామాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనిపై ఆందోళన చెందుతున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు చెప్పారు. వీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వీరు సంబంధిత శాస్త్రవేత్తలతో మాట్లాడి.. ప్రకంపనలు నిజమేనని తేల్చారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని పులి చింతల, గోవిందాపురం గ్రామాలు కేంద్రంగా చేసుకుని స్వల్ప ప్రకంపనలు వస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈనెల 2 నుంచి 11 తేదీ మధ్యలో సుమారుగా పది సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు. వీటి తీవ్రత భూకంప లేఖినిపై 3.2, అంతకంటే తక్కువగా నమోదైంది.