అదిరిపోయే ఫీచర్లతో ' రియల్ ఎక్స్ 2 '
భారతీయ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ బుధవారం లాంచ్ చేసింది. రియల్ ఎక్స్ 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు రియల్ ఎక్స్ 2 ప్రొ మాస్టర్ ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ ధరలు ఇలా ఉన్నాయి.. ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 ఉండగా మాస్టర్ ఎడిషన 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.34, 999గా నిర్ణయించారు. అలాగే రియల్ మి ఎక్స్ 2 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.50 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 + ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పై, 1080 x 2400 పిక్సె ల్స్ రిజల్యూషన్, 8జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ అమర్చినట్టు తెలుస్తోంది.
అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 64+13 +8+ 2 ఎంపీ క్వాడ్ రియర్‌కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌తో పాటు రియల్ మి ఎస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ కూడా కంపెనీ లాంచ్ చేసింది. 48ఎంపీ ప్రైమరీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రెండు వేరియంట్లలోలాంచ్ చేసింది. య రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి వీటిని అమ్ముతారు.