సహజంగా మన ఫోన్లో ఇంటర్నెట్ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అలా నెట్ కనెక్టివిటీ లేపప్పుడు మన పనులు ఆగిపోకుండా ఉండటం కోసం ఇటీవల కాలంలో దాదాపు అన్ని అప్లికేషన్లు అవసరమైన డేటాను ఆఫ్‌లైన్‌లో అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలా ఆఫ్‌లైన్ డేటా సదుపాయాన్ని అందిస్తున్న కొన్ని అప్లికేషన్లు వివరాలు..
గూగుల్ మ్యాప్స్: మనం మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గూగుల్ మ్యాప్స్. మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎవరి సహాయం లేకుండా నావిగేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాంటి సమయంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే అలాంటి సమయంలో మీరు కావాల్సిన ప్రదేశాన్ని వెతికి పెట్టుకొని, ఆ తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే ఇంటర్నెట్ లేకపోయినా డైరెక్షన్లు చూపించే విధంగా ఈ మ్యాప్ డౌన్లోడ్ అవుతుంది.
వీడియోలు: ఇటీవల కాలంలో ఎక్కువశాతం మంది వీడియో కంటెంట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌తో సహా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వైడ్ వంటి పాపులర్ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లు మనకు నచ్చిన విడియోల నెట్ కనెక్షన్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకుని చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.
పాకెట్: ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన వెబ్ పేజీలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పటికప్పుడు వాటిని చదివే సమయం లేకపోయినా, ఆ తర్వాత చదవడాపిరి నెట్ కనెక్షన్ లేకపోతే అప్పుడు `పాకెట్` సర్వీస్ ఉపయోగపడుతుంది. మీ దృష్టికి వచ్చిన అన్ని రకాల కంటెంట్లు దీంట్లో సేవ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకపోయినా ఆ సమాచారాన్ని ఆఫ్‌లైన్‌లో చదివే అవకాశం ఉంటుంది.
స్పాటిఫై: ప్రయాణాలు చేసేటప్పుడు లేదా పని చేసేటప్పుడు పాటలు వినడం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారికి స్పాటిఫై ఉపయోగపడుతుంది. దీంట్లో 10 వేల పాటలు వరకు ఆఫ్‌లైన్‌లో డౌన్లోడడ్ చేసుకోవచ్చు. కావాలసిన ప్లే లిస్టులుగానీ, ఏకంగా ఆల్బమ్లుగానీ ఇంటర్నెట్ లేకుండా ఎప్పుడైనా వినగలిగేలా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
RSS రీడర్: వివిధ వెబ్సైట్లకు సంబంధించిన RSS ఫీడ్లను మీరు తరచూ చదివినట్లైయితే నెట్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ నెట్ కనెక్షన్ లేకపోతే ఆ ఫీడ్లను చదవడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో RSS రీడర్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడవం ద్వారా కావాల్సిన కంటెంట్ ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకొని నెట్ లేకపోయినా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.