“ఐ ఫోన్” యూజర్స్ కి...”గుడ్ న్యూస్”

స్మార్ట్ ఫోన్స్ లో రారాజు టెక్ దిగ్గజం అయిన యాపిల్ మొట్టమొదటి సారిగా డ్యుయల్ సిమ్ ఉన్న ఐ ఫోన్ లని మార్కెట్ లోకి విడుదల చేసింది ఈ మొబైల్ ఫోన్ తో పాటుగా మరిన్ని యాపిల్ ఉత్పత్తులని ప్రవేశపెట్టింది. కాలిఫోర్నియా లో బుధవారం యాపిల్ సిఈవో కుక్  ఈ డ్యుయల్ ఐఫోన్‌ 10ఎస్‌ ఫోన్లను  ఆవిష్కరించారు...దీని తాకే తెర 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ లభిస్తాయి.

 

64జీబీ,  256జీబీ,  512జీబీ మెమరీ  లతో ఈ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి..సెప్టెంబర్‌ 14 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై..సెప్టెంబర్‌ 21 నుంచి వీటి తొలి దశ డెలివరీ మొదలవుతుంది...రెండో దశ డెలివరీ సెప్టెంబర్‌ 28 నుంచి చేపట్టనుంది. ఆ సమయం నుంచే భారత్‌కు కూడా ఈ డివైజ్లు వస్తాయి. ఐఫోన్‌ 10ఎస్‌ ధర 999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ ధర 1099 డాలర్ల నుంచి మొదలువుతుంది.

 

అయితే ఈ మొబైల్స్ రెండిటిలో కూడా డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్ లు చేర్చారు..ఇదే వేదికపై వాచ్‌లలో సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది...పాత వాటి స్క్రీన్ తో పోలిస్తే ఈ వాచ్‌ల స్క్రీన్‌ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను ఈ వాచ్ లో నిక్షిప్తం చేశారు..అంతేకాదు గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ  తీసుకోవచ్చు. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: