
టివి: అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ కు బంపర్ ఆఫర్.. ఏకంగా బిగ్ బాస్ లో ఆఫర్..!
కానీ ఇటీవలే ఒక కస్టమర్ పైన దారుణమైన బూతులతో తిట్టడంతో ఒకసారిగా వీరి క్రేజ్ పడిపోవడమే కాకుండా ధరలు అధికంగా ఉన్నాయని విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో చాలామంది ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పైన నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా రకాల మీన్స్ ట్రోల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లకు ఒకరికి బిగ్ బాస్ రియాల్టీ షోలో వెళ్లేందుకు అవకాశం వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురు అక్క చెల్లెల్లలో రమ్య అనే అమ్మాయికి ఛాన్స్ వచ్చేలా ఎక్కువగా ఉన్నాయట. ఈమె ఎక్కువగా మోడ్రన్ దుస్తులలో రీల్స్ చేస్తూ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈమెకి వచ్చే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవలే జియో హాట్ స్టార్ లో కూడా పచ్చళ్లకు సంబంధించి ఒక సన్నివేశాన్ని షేర్ చేయడంతో ఇప్పుడు అందుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది. అందుకే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్లలో ఒకరికి ఈ బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.