
టివి: బెట్టింగ్ యాప్స్ గుట్టు విప్పిన విష్ణుప్రియ.. నిమిషానికి అంతనా..?
ఈ విషయాల పైన పంజాగుట్ట పోలీసులకు యాంకర్ విష్ణుప్రియ నిజాలను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు విన్న తర్వాత పోలీసులే ఆశ్చర్యపోయారట. ప్రజలను నీట్ట నిలువున దోపిడీ చేస్తూ వారి ప్రాణాలను తీసేలా చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్స్ యాప్స్ పైన పోలీసులు చాలా విషయాలను రాబడుతున్నారు ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు కూడా నోటీసులు పంపించడం జరిగింది. తాజాగా యాంకర్ విష్ణుప్రియను పోలీసులు విచారించగా ఆమె పంజాగుట్ట పోలీసులకు తన లాయర్ తో కలిసి వచ్చిందట. అక్కడ పోలీసులు అడిగిన సమాచారం మేరకు విష్ణుప్రియ సమాధానాలను తెలియజేసిందట.
తాను 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లుగా పోలీసులకు తెలియజేసింది అయితే నిమిషం వ్యవధిలోనే చేసే ఈ ఒక్కో వీడియోకి సైతం సుమారుగా 90000 వరకు ఇచ్చినట్లు తెలియజేసింది. సుమారుగా మూడు గంటల పాటు ఈ విచారణ జరిగిన అనంతరం బెట్టింగ్ గ్యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా తనకు భారీగానే డబ్బులు వచ్చినట్లు విష్ణుప్రియ కూడా అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవులు కూడా వారికి అందజేసిందట విష్ణు ప్రియ. మరి ఈ కేస్ దర్యాప్తుని మరింత లోతుగా పోలీసులు విచారణ చేయబడుతున్నట్లు తెలుస్తోంది. విష్ణుప్రియ మొబైల్ ని కూడా సీజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం మీద అభిమానులకు ఏ విధమైనటువంటి సూచన ఇస్తుందో చూడాలి మరి.