
టివి: ఇమ్మాన్యుయేల్ ముందే అతనితో రొమాన్స్ తో రెచ్చిపోయిన వర్ష..!
తమ టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్న ఈ కమెడియన్ జబర్దస్త్ లో స్పెషల్ ఇమేజని సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే స్కిట్లకు బాగానే రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా వీరిద్దరూ తమ నటనతో ఆన్ స్క్రీన్ పైన రొమాన్స్ కి కూడా చాలామంది ఫిదా అవుతూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య రియల్ గానే సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. కానీ వీరిద్దరూ మాత్రం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇదంతా ఇలా ఉండగా తాజాగా వర్ష, డాన్సర్ పండుతో కలిసి చేసిన రొమాన్స్ చేయడం అది కూడా పండుతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉన్న సన్నివేశాలను ఇమ్మాన్యుయేల్ ఆశ్చర్యపోవడం జరిగింది. ఇది స్కిట్ లో హైలైట్ గా మారింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ వీరిద్దరిని చూసి ఆశీర్వదించడం కూడా ఈ ప్రోమోలో మనం చూడవచ్చు. వర్ష , ఇమ్మాన్యుయేల్ ఆన్ స్క్రీన్ పైన రొమాన్స్ కి మంచి క్రేజీ ఉన్నప్పటికీ డాన్సర్ పండుతో వర్ష చేస్తున్నటువంటి స్కిట్లు మరింత హైలెట్ గా మారుతున్నాయి. అయితే ఇదంతా కూడా స్కిట్లో భాగంగానే కనిపిస్తోంది. తాజాగా జబర్దస్త్ ప్రోమో కడుపు బా నవ్వించేలా కనిపిస్తోంది . వీరితో పాటు చాలామంది కమెడియన్స్ కూడా తమ అదరగొట్టేశారు.