టివి: బుల్లితెరపై కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా.. ప్రభాకర్ ఏమన్నాడంటే..?

frame టివి: బుల్లితెరపై కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా.. ప్రభాకర్ ఏమన్నాడంటే..?

Divya
తెలుగు బుల్లితెర పైన సీరియల్ నటుడుగా పేరుపొందిన ప్రభాకర్ ఎన్నో సీరియల్స్ లో పాటు పలు చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా ఈయనకు ఈటీవీ ప్రభాకర్ అనే ముద్ర కూడా పడిపోయింది. అయితే తాను ఈటీవీలో పనిచేయడం వల్లే పైకి వచ్చానని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ తాను ఏ టీవీలో పనిచేసిన కూడా అక్కడ సూపర్ హిట్ లు వస్తూ ఉన్నాయని తనకి గుర్తింపు రావడం తన కష్టం వల్లే జరిగిందంటూ తెలిపారు. ఇటీవలే ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ 100 ఎపిసోడ్ సందర్భంగా ఇంటర్వ్యూలో ముచ్చటించడం జరిగింది ప్రభాకర్.
తనని బుల్లితెర మెగాస్టార్ అంటూ పొగిడే వారు కూడా ఉన్నారు. వీడొక వేస్ట్ గాడు అని వారు కూడా చాలామంది ఉన్నారని కానీ వాటిని తాను పట్టించుకోరని తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారని తెలిపారు. తాడు ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పని చేస్తానని తెలిపారు. 100% లో 51% మాత్రమే తాను లెక్కలోకి తీసుకుంటానని మిగతాదంతా వదిలేస్తూ ఉంటానని తెలిపారు. కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండవచ్చు వాడు మనవాడు కాదు మనవాడు మాత్రమే ఎదగాలి అనుకుంటూ ఉంటారు.. ఇలాంటి విషయాలు చాలా ఎదురయ్యాయని.. ఎలాంటి విషయాన్నైనా కూడా పాజిటివ్ గానే చూడాలని తెలిపారు.

ఈటీవీ ప్రభాకర్ అంటూ ఉండడం వల్ల ఈటీవీ వల్లే పైకి వచ్చారు అనుకోని చాలామంది అనుకుంటూ ఉంటారు. తాను బయటికి వచ్చిన తర్వాతే మరింత పేరు సంపాదించానని .. అప్పుడే తన కష్టం వల్లే తాను పైకి వచ్చాడనే విషయాన్ని అందరూ తెలుసుకున్నారని తెలిపారు. జీ టీవీ, మా టీవీ, జెమినీ టీవీలలో తన కష్టమే తనను నిలబెట్టింది అంటూ తెలియజేశారు. సీరియల్స్లలో వినోదాన్ని పంచడంతోపాటు కుటుంబ విలువలు పద్ధతిని చూపించే బాధ్యతలను కూడా తాను అందరికీ గుర్తు చేస్తున్నానని తెలిపారు. ఎవరింట్లోనైనా పిల్లలు ఇల్లాలు ఉంటేనే జీవితం లేకపోతే లేదు అంటూ తెలిపారు ప్రభాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: