టీవీ: బిగ్ బాస్ విన్నర్ ఎవరో రివీల్ చేసిన మాజీ రన్నరప్..!
అఖిల్ మాట్లాడుతూ.. నాకు గౌతమ్ అంటే చాలా ఇష్టం. ఆయన విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. గౌతమ్ కి విన్నర్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈసారి షో కూడా చాలా బాగుంది. గౌతమ్ కే టైటిల్ దక్కే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు అఖిల్. తన అంచనా ప్రకారం గౌతమ్ విన్నర్ అవ్వాలని చెప్పిన అఖిల్, కానీ నిఖిల్ ని విన్నర్ ను చేయబోతున్నారనే అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టారు. గౌతమ్ వైల్డ్ కార్డు ద్వారా వచ్చారు ఒక దశలో మణికంఠ స్థానంలో ఆయన ఎలిమినేట్ కూడా కావాల్సింది. కానీ మణికంఠ వెళ్లిపోవడంతో గౌతం సేవ్ అయ్యాడు. ఇక అప్పటినుంచి తన ఆట తీరును మార్చుకోవడం జరిగింది.. ఫైరింగ్ మూడ్ లోకి వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతూ మంచి ఇమేజ్ దక్కించుకున్నారు.
దీనికి తోడు అనూహ్యంగా టాప్ లోకి వచ్చేసారు గౌతమ్ టైటిల్ రేసులో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్ విన్నర్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. అఖిల్ కూడా అదే చెప్పారు.కానీ బిగ్ బాస్ షో వెనుక జరిగే నిజాలను కూడా బయటపెట్టారు. ఏది ఏమైనా నిఖిల్ ని విన్నర్ ను చేయబోతున్నారనే అతిపెద్ద రహస్యాన్ని రివీల్ చేశారు అఖిల్.