టీవీ: అనసూయకు కూడా వేధింపులు తప్పడం లేదా.. ఏం జరిగిందంటే..?
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ నిరంతరం ఏవో ఒక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ట్రోల్ కి కూడా గురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అనసూయకు సంబంధించి న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే అనసూయను ఒక వ్యక్తి ఫోన్ చేసి తరచూ రాత్రిపూట ఇబ్బంది పెడుతున్నారట.. ముఖ్యంగా తన రేటు ఎంత అని చెప్పమని అడుగుతున్నాడని .. ఈ విషయం పైన అనసూయ కి విసుగు వచ్చి ఆ వ్యక్తి నెంబర్ బ్లాక్ చేసిన ఇతర నెంబర్ నుంచి ఫోన్ చేసి చాలా విసిగిస్తున్నారట..
దీంతో ఈ విషయాన్ని అనసూయ తన స్నేహితులకు చెప్పి మరి బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ అవుతున్నది.ప్రస్తుతం అయితే అనసూయ పుష్ప-2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికి హీరోయిన్లకు దీటుగానే తన అంద చందాలతో ఆకట్టుకుంటోంది అనసూయ.